Asianet News TeluguAsianet News Telugu

భారీ బడ్జెట్‌తో నాగశౌర్య కొత్త సినిమా.. గ్రాండ్‌ గా లాంచ్‌.. ప్రత్యేకత ఏంటంటే?

ఇటీవల `కృష్ణవిందా విహారి` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. హీరోగా పూర్వ వైభవాన్ని పొందాడు. ఈ సినిమా విజయం ఆయనకు కెరీర్‌కి పెద్ద బూస్ట్ నిచ్చింది. 

naga shourya new movie opening with big budjet and new makeover
Author
First Published Nov 6, 2022, 9:21 PM IST

యంగ్‌ హీరో నాగశౌర్య వరుస పరాజయాల అనంతరం ఇటీవల `కృష్ణవిందా విహారి` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. హీరోగా పూర్వ వైభవాన్ని పొందాడు. ఈ సినిమా విజయం ఆయనకు కెరీర్‌కి పెద్ద బూస్ట్ నిచ్చింది. దీంతో కొత్త సినిమాల విషయంలో జోరు పెంచుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా కొత్త సినిమాని స్టార్ట్ చేశారు. 

బేబీ అద్వైతా అండ్‌ భవిష్య సమర్పణలో వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్‌ కుమార్ చింతలపూడి, డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ చింతలపూడి నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ఎస్‌ఎస్‌ అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడి స్టూడియోలో ప్రారంభమైంది. నాగశౌర్య నటిస్తున్న 24వ చిత్రమిది. అథితిగా వచ్చిన దర్శకుడు వివి వినాయక్‌ క్లాప్‌నివ్వగా, అభిషేక్‌ అగర్వాల్ కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు తిరుమల కిశోర్‌ దర్శకత్వం వహించారు. 

ఈ సినిమాని నాగశౌర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. యూత్‌, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. అయితే ఇందులో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారట. ఆయన మేకోవర్‌ కొత్తగా ఉంటుందట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన పాత్ర ఉండబోతుందని చెబుతున్నారు టీమ్‌. ఇందులో టాప్‌ టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. హరీష్‌ జయరాజ్‌ సంగీతం, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రాఫర్‌, చోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌, సాయి ప్రవీణ్‌ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఇక నాగశౌర్య నటించిన చివరి చిత్రం `కృష్ణవ్రిందా విహారి` చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ఆకట్టుకుంది. ఓ వైపు భార్యని, మరోవైపు అమ్మని మ్యానేజ్‌ చేయలేక మధ్య నలిగిపోయే అబ్బాయి కథతో రూపొందిన ఈ చిత్రంలో శౌర్య అద్భుతంగా చేశారు. నవ్వులు పూయించే ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. శౌర్య కెరీర్‌కి పెద్ద బూస్ట్ నిచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios