టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుల్లో ఎంఎం కీరవాణి ఒకరు. ఆయన గొప్ప సంగీత దర్శకుడు మాత్రమే కాదు.. గాయకుడు కూడా.. అయితే ఆయన సినిమాలలో చాలా అరుదుగా పాటలు పాడుతుంటారు. కానీ ఆయన గాత్రానికి ఉన్న శక్తి బాగా ప్రభావితం చేస్తుంటుంది.

తాజాగా ఆయన శంకర్ రూపొందిస్తోన్న '2.0' సినిమాలో ఓ పాట పాడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. '2.0' తెలుగు వెర్షన్ లో కీరవాణి బుల్లి గువ్వా అనే పాటను పాడినట్లు తెలుస్తోంది.

ఇదివరకు ఈ సినిమాను రెండు పాటలు విడుదలయ్యాయి. అప్పుడు ఈ పాట లేదు. ఇప్పుడు కొత్తగా జోడించనున్నారు. సినిమాలో ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు కీరవాణి.. రెహ్మాన్ కి ధన్యవాదాలు చెప్పారు.

మరి ఈ పాట ఎలా ఉందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. మరికాసేపట్లో సినిమా ట్రైలర్ ని విడుదల చేయనుంది చిత్రబృందం. నవంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవి కూడా చదవండి.. 

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు