Asianet News TeluguAsianet News Telugu

ఏనుగును చూసి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

మంచు మనోజ్ పెళ్ళి మోహన్ బాబుకు ఇష్టం లేదా..? గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం ఇదే. ఇందలో నిజం ఎంత..? ఈ విషయంలో మోహన్ బాబు ఏమన్నారంటే.
 

Manchu Mohan babu Shocking Comments On Manoj Marriage
Author
First Published Mar 23, 2023, 2:34 PM IST

మంచు మనోజ్ పెళ్ళిపై.. తనపై వస్తున్న వార్తలపై స్పందించారు మంచు మోహన్ బాబు. ఈవిషయంలో చాలా ప్రచారం జరుగుతుంది ఇంతకీ మనోజ్ పెళ్ళి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడగ్గా.. మోహన్ బాబు మాట్లూడుతూ.. మనోజ్ నా దగ్గరికి వచ్చాడు.. వచ్చి పరిస్థితి ఇదీ అంటూ.. వివరంగా చెప్పాడు. పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. అయితే నేను ఒక్కసారి ఆలోచించారా అన్నాను. కాని లేదు డాడీ నేను నిర్ణయం  తీసుకున్నాను. అది సరైనదే అని పక్కాగా ఫిక్స్ అయి ఉన్నారు. ఈసారి రాంగ్ స్టెప్ మాత్రం వేయను అని అనడంతో..  అయితే అలాగే కానీ .. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను అంటూ వివరించారు మోహన్ బాబు. 

సోషల్ మీడియాలో ఏదో రాశారు.. మీడియాలో ఏదో ప్రచారం చేశారు.. వాళ్ళు ఏదో చెప్పినట్టు... మనోజ్ పెళ్లి నేను ఎలా కాదని  అంటాను.. అంటూ రివర్స్ క్యశ్చన్ చేశారు మోహన్ బాబు.  అంతే కాదు మనోజ్ పెళ్లి విషయంలో.. ఎవరో ఏదో అనుకుంటున్నారని.. ఎవరో ఏదో రాశారని...ప్రచారం చేశారని నేను బాధపడను.. అసలు వాటి గురించి నేను ఆలోచించను అన్నారు మోహాన్ బాబు. అంతే కాదు అసలు అలాంటివి ఆలోచించే అలవాటునాకు అలవాటు లేదు అన్నారు కలెక్షన్ కింగ్. అంతే కాదు ఇప్పుడు ఉన్న సమాజంలో  వాడేం అనుకుంటున్నాడో .. వీడేం అనుకుంటున్నాడో అని పట్టించుకుంటూ కూర్చుంటే నన్ను నేను మరిచిపోతాను అన్నారు మోహాన్ బాబు.

అంతే కాదు రోడ్డు మీద  ఏనుగు వెళుతుంటే.. పక్కన ఉన్న  కుక్కలెన్నో మొరుగుతూ ఉంటాయి. అవి మోరిగాయని ఏనుగు పట్టించుకుంటే ఎట్లా.. అన్నారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. సుఖంగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమించుకున్నారు? వంటి విషయాల్లోకి డీప్ గా వెళ్లొద్దు. నేను హ్యాపీగా ఉన్నాను కనుకనే పెళ్లికి వెళ్లాను. ఈ విషమంలో రాద్దాంతం చేసేవారు ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించాలి అన్నారు మెహన్ బాబు. ఇక ప్రస్తుతం రెస్ట్  లో ఉన్నారు కలెక్షన్ కింగ్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. 

ఈమధ్య కాలంలో మోహన్ బాబు మూవీస్ పెద్దగా చేయడం లేదు. చేసినా అవి బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. ఈక్రమంలో ఆయన సినిమాల  సంఖ్యని తగ్గించారు. ఒక వేళ సినిమాలు చేయాలి అనుకున్నా.. తనకు  తగిన పాత్రలను మాత్రమే చేస్తున్నారు. అటు రాజకీయాలు కూడా వదిలేశారు మోహన్ బాబు. తనకు రాజకీయాలు సెట్ అవ్వవని.. అందుకే వదిలేసినట్టు ప్రకటించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబు శాకుంతలంసినిమాలో నటించారు. మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios