MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Annapurna: భర్తను రెండో పెళ్లి చేసుకోమన్న స్టార్ నటి.. అన్నపూర్ణ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి?

Annapurna: భర్తను రెండో పెళ్లి చేసుకోమన్న స్టార్ నటి.. అన్నపూర్ణ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి?

Annapurna: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటి అన్నపూర్ణ. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, వైవాహిక జీవితం గురించి చాలా ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 08 2026, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
700 లకు పైగా సినిమాలు..
Image Credit : Asianet News

700 లకు పైగా సినిమాలు..

తెలుగు సినీరంగానికి గర్వకారణమైన నటీనటులలో అన్నపూర్ణ ఒకరు. ఆమె దాదాపు ఏడువందలకుపైగా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన నటి. హీరోయిన్ గా, అక్కగా, వదినగా, హీరోలకు తల్లిగా నటిస్తూ వచ్చిన అన్నపూర్ణ.. ప్రస్తుతం బామ్మ పాత్రలతో సందడి చేస్తున్నారు. తనకంటే వయసులో చాలా పెద్ద పెద్ద నటులకు కూడా ఆమె తల్లిగా నటించి మెప్పించారు. ఎమోషనల్‌, సెంటిమెంట్‌, కామెడీ, నెగటివిటీ ఇలా అన్ని రకాల పాత్రలతో తెలుగు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేశారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు అన్నపూర్ణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కుటుంబ బాధ్యతలకే ఇంపార్టెన్స్..
Image Credit : our own

కుటుంబ బాధ్యతలకే ఇంపార్టెన్స్..

అన్నపూర్ణ సినీ రంగానికి రావడానికి ప్రధాన కారణం ఆమె కుటుంబ పరిస్థితులే. ఆ సమయంలో ఆమె పుట్టింటి కుటుంబం ఆర్థికంగా దిగువ మధ్యతరగతి స్థాయిలో ఉండేది. చెల్లెళ్ల పెళ్లిళ్లు కాకపోవడం, తమ్ముడి చదువు పూర్తి కాకపోవడం వల్ల వాటన్నింటినీ నిలబెట్టే బాధ్యత ఆమెపై పడింది. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికే తాను సినిమాల్లోకి వచ్చానని, ఆ కష్టసమయంలో తన కుటుంబాన్ని వదిలిపెట్టి సొంత సుఖాల కోసం జీవించలేకపోయానని ఆమె తెలిపారు.

Related Articles

Related image1
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Related image2
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
34
వైవాహిక జీవితం – భర్తకు తెగేసి చెప్పిన నిజం
Image Credit : Asianet News

వైవాహిక జీవితం – భర్తకు తెగేసి చెప్పిన నిజం

వివాహం తర్వాత కూడా నటనా రంగాన్ని వదిలిపెట్టలేని పరిస్థితి ఆమెది. భర్తకు అందుబాటులో ఉండలేకపోవడం, ఇంటి పనులు చూసుకోలేకపోవడం వల్ల ఆయనకు సరైన సమయం కేటాయించలేకపోయారు. అందుకే భర్తకు కూడా అన్నపూర్ణ క్లారిటీ ఇచ్చారట. "నా వల్ల నీకు కష్టం కలుగుతున్నప్పుడు, ఆ కష్టాన్ని నేను తీర్చలేనప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడం సరికాదు" అనే ఉద్దేశంతో ఆమె తన భర్తతో చాలా స్పష్టంగా మాట్లాడారు.

తన బాధ్యతల వల్ల తాను ఫీల్డ్ (సినిమాలు) వదిలి రాలేనని, ఇంటి పట్టునే ఉండే వేరే ఎవరినైనా చూసి రెండో పెళ్లి చేసుకోవచ్చని స్వయంగా తన భర్తకే చెప్పానని అన్నపూర్ణ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. "నేను ఎంత దుర్మార్గురాలినంటే... నా భర్తను ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాను" అని సరదాగా అంటూనే, ఆ మాట వెనుక ఉన్న తన కుటుంబ బాధ్యతల బరువు గురించి వివరించారు. అయితే ఆమె భర్త ఎప్పుడూ ఆమెపై అపవాదులు వేయలేదని, ఆమె మంచి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నారని తెలిపారు.

44
ఫిల్మ్ ఇండస్ట్రీలో కఠిన శ్రమ
Image Credit : Asianet News

ఫిల్మ్ ఇండస్ట్రీలో కఠిన శ్రమ

చెన్నై (మద్రాస్) లో షూటింగ్ రోజుల్లో పడ్డ కష్టాలను కూడా అన్నపూర్ణ పంచుకున్నారు. ఉదయం 4 గంటలకే లేచి, తయారై వాహినీ స్టూడియోకి వెళ్లేవారమని చెప్పారు. రోజూ 8 నుండి 9 గంటల పాటు చెమటలు కక్కే ఎండలో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేదని తెలిపారు. సెట్స్‌లో దిగ్గజ నటులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు వారిని చూసి భయభయంగా ఉండేదని, పని ఒత్తిడి వల్ల వేరే ఆలోచనలకే తావు ఉండేది కాదని పేర్కొన్నారు. బాధ్యతలను నెరవేర్చడం కోసం వ్యక్తిగత కోరికలను పక్కనపెట్టి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అన్నపూర్ణ గారి తత్వం నేటికీ ఎంతోమందికి ఆదర్శం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Recommended image2
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Recommended image3
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Related Stories
Recommended image1
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Recommended image2
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved