MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?

Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?

Youtuber Nandu: ఎట్టకేలకు నందు అరెస్ట్ అయ్యింది. యూట్యూబ్ లో స్టార్ గా వెలుగు వెలిగిన రమా నందనపై… వీసాల పేరిట మోసం చేసిన ఆరోపణలతో కేసులు నమోదు అవ్వగా.. చాలా కాలానికి ఆమెను అరెస్ట్ చేశారు. నందుకు ఈ కేసులో ఏ శిక్ష పడే అవకాశం ఉంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 08 2026, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నందూస్ వరల్డ్ రామనందన అరెస్ట్
Image Credit : Asianet News

నందూస్ వరల్డ్ రామనందన అరెస్ట్

సోషల్ మీడియాలో స్టార్ గా వెలుగు వెలిగింది యూట్యూబర్ రమానందనన. ఈమధ్యనే ఆమె వీసా కేసులో ఇరుక్కుంది. అప్పటి నుంచి ఈ కేసు వివాదం నడుస్తుండగా.. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలోనే పోలీసులు ‘లుక్ అవుట్ నోటీసులు’ (Lookout Circular) జారీ చేసి ఉండటంతో విమానాశ్రయ అధికారులు ఆమెను గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. ఆపై తదుపరి విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆమెను అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కేసు నేపథ్యం ‌- విదేశీ ఉద్యోగాల మోసం
Image Credit : facebook.com/NandusWorld

కేసు నేపథ్యం ‌- విదేశీ ఉద్యోగాల మోసం

యూట్యూబర్ నందనకు ఉన్న ఫాలోయింగ్ ను ఉపయోగించి లండన్‌లో ఉద్యోగాలు, వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామంటూ నందన ఆమె భర్త పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వర్క్ పర్మిట్‌లకు సంబంధించి ‘స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్’ వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. నందన తన భర్త లండన్‌లో వర్క్ పర్మిట్లు మంజూరు చేసే పలు సంస్థలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ మోసపూరిత నెట్‌వర్క్ బాధితులు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలతో పాటు రాజస్థాన్, గుజరాత్, బిహార్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా ఈ దంపతుల మాటలు నమ్మి డబ్బులు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు సుమారు 50 మందికి పైగా అభ్యర్థులు వీరి చేతిలో మోసపోయినట్లు సమాచారం.

Related Articles

Related image1
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Related image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
34
లుక్ అవుట్ నోటీసులు‌ - అరెస్ట్
Image Credit : facebook.com/NandusWorld

లుక్ అవుట్ నోటీసులు‌ - అరెస్ట్

ఉద్యోగాలు రాకపోవడం, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను అర్థం చేసుకున్న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు రమానందన దంపతులపై కేసు నమోదు చేసి, విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రమానందన అమెరికా నుంచి ఎమిరేట్స్ (EK-526) విమానంలో హైదరాబాద్ RGIA ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ అలర్ట్ ఆధారంగా ఆమెను నిలిపివేశారు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించి వారి కస్టడీకి అప్పగించారు.

44
నందుకి ఏ శిక్షపడే అవకాశం ఉంది..?
Image Credit : Nandu's World Instagram

నందుకి ఏ శిక్షపడే అవకాశం ఉంది..?

నందు దంపతులపై ఇండియాతో పాటు యూకేలో కూడా కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది. అక్కడ ఉన్న కొంత మంది అభిప్రాయం ప్రకారం యూకేలో నందు, మధుకర్ లపై వచ్చిన ఆరోపణలు రుజువైతే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంటుందని సమాచారం. అక్కడి ఇటువంటివి చాలా పెద్ద క్రైమ గా పరిగణిస్తారు. అంతే కాదు వీసా స్కామ్ తో పాటు ఫోర్జరీ ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో వీరి నేరం రుజువైతే 8 నుంచి 10 ఏళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు. అంతే కాదు భారీగా జరిమాన కూడా విధిస్తారని సమాచారం. ఇక ఇండియాలో ఈ విషయంలో 5 ఏళ్ల వరకూ జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్టు సమాచారం. పరిస్థితులను బట్టి ఇక్కడ బెయిల్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రామ నందన అరెస్ట్ అయ్యారు. కానీ దోషిగా తేలిన తరువాత శిక్ష ఖరారు అవుతుంది. వారు పైకోర్టులకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాసెస్ కు చాలా టైమ్ పడుతుంది.

ఆరోపణలపై నందన స్పందన

ఈ వ్యవహారంపై గతంలో సోషల్ మీడియాలో విమర్శలు రాగా, తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అసత్యమని తెలుపుతూ నందన ఒక వీడియోను విడుదల చేశారు. అయితే, ఆ వీడియోలో వీసా మోసాల పై ఆమె స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఈ కుంభకోణం వెనుక ఎంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అనే వివరాలు బయటకు రానున్నాయి. సత్వరమే న్యాయం జరిగి తమ సొమ్ము తమకు దక్కాలని బాధితులు కోరుతున్నారు. మరి విచారణలో ఆమె ఏం చెపుతుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Recommended image2
Ramba Oorvasi Menaka 4 Days Collections: రంభ ఊర్వశి మేనక సోమవారం కలెక్షన్లు.. అల్లరి నరేష్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి జడ్జిమెంట్ రాంగ్ అని నిరూపించిన అసిస్టెంట్.. జేబులో ఉన్న 10 వేలు ఇచ్చేసిన మెగాస్టార్
Related Stories
Recommended image1
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved