Asianet News TeluguAsianet News Telugu

తెలుగు లో హీరోయిన్ గా మల్లికా షెరావత్

 అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు. ముంబైలో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, త్వ‌ర‌లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 

Mallika Sherawat to debut in Tollywood with Nagamati
Author
Mumbai, First Published Nov 11, 2021, 5:53 PM IST

 బాలీవుడ్‌ సెక్స్ బాంబ్ గా చెలామణి అయిన మల్లికా శెరావత్.. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించడం ఈ భామ స్పెషాలిటీ. ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు మానేసిన మ‌ల్లికా ఫొటోషూట్స్‌తో పిచ్చెక్కించటమే  పనిగా పెట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ తెలుగు సినిమాలో ఆమె కనపడబోతోంది.

 బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. పిరీడ్ డ్రామా కథాంశంతో తెరకెక్కే నాగమతి చిత్రంలో మ‌ల్లికా కీలక పాత్ర పోషించ‌నుంది. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు. ముంబైలో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, త్వ‌ర‌లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.  ఈ చిత్రం పీరియాడికల్ హారర్ థ్రిల్లర్ గా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. నాగమతి కథ ప్రేక్షకులను 1900, 1947, 1990 మూడు కాలాల్లోకి తీసుకెళ్లబోతోంది. ఇందులో న‌టించే న‌టీనటులు ఎవ‌రు, త‌దిత‌ర విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. 

మల్లీకా షెరావత్ నార్త్  హీరోయిన్ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. సౌత్ లోనూ ఆమెకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ తో పాటు అప్పట్లోనే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది మల్లికా. జాకీ చాన్ “ది మిత్” సినిమాలో మెరిసింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. అంతేకాదు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నేళ్లకు టాలీవుడ్ అరంగ్రేటం చేయబోవటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios