సోనమ్ కపూర్ ను తిట్టిన బాలీవుడ్ బ్యూటీ

మనీష్ బర్త్ డే పార్టీలో హీరోయిన్ సోనమ్ కపూర్ ను.. గబ్బర్ సింగ్ ఐటెం గాళ్ మలైకా అరోరా చెడామడా తిట్టిపోసిందట. పార్టీలో భాగంగా ఫుల్లుగా తాగేసిన కెవ్వుకేక బ్యూటీ.. మరీ శృతి మించి పట్టించేసిందట. తాగిన డోస్ బాగా ఎక్కువైపోవడంతో.. మలైకా కనీసం నిలబడలేక పడిపోబోయిందట కూడా. అలా కింద పడిపోతున్న మలైకాను.. పక్కనే ఉన్న సోనమ్ కపూర్ సాయం చేయడం కోసం పట్టుకుందట. 

'నాకు నేను కంట్రోల్ చేసుకోగలను.. దూరంగా పో అవతలికి' అంటూ కసరడం మొదలుపెట్టి.. తర్వాత చాలానే చదివేసిందట మలైకా అరోరా. భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకుల వ్యవహారం నుంచి మలైకా బాగా మారిపోయిందని.. అందుకే ఇలా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తోందని అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.