Asianet News TeluguAsianet News Telugu

హమీదకి మసాజ్‌ చేసిన శ్రీరామచంద్ర.. ప్రేమ పాఠాలు షురూ.. మెచ్యూరిటీ లేదంటూ మానస్‌ కామెంట్‌

ఓ ప్రేమ పక్షుల జంట బయటపడింది. ఈ టాస్క్ పూర్తయిన తర్వాత స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సింగర్‌ శ్రీరామ చంద్ర, హమీద ప్రేమ పాఠాలు చెప్పుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఏకంగా హమీదకి శ్రీరామచంద్ర బాడీ మసాజ్‌ చేశారు. 

love start between sriram chandra and hamida manas shocking comment
Author
Hyderabad, First Published Sep 16, 2021, 12:03 AM IST

బిగ్‌బాస్‌ 5 పదో రోజు గేమ్‌ మరింత హీటెక్కించింది. `దొంగలున్నారు జాగ్రత్త` పీక్‌కి తీసుకెళ్లింది. షోని సీరియస్‌గా మార్చింది. అయితే ఈ మధ్యలోనే పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ఓ ప్రేమ పక్షుల జంట బయటపడింది. ఈ టాస్క్ పూర్తయిన తర్వాత స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సింగర్‌ శ్రీరామ చంద్ర, హమీద ప్రేమ పాఠాలు చెప్పుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఏకంగా హమీదకి శ్రీరామచంద్ర బాడీ మసాజ్‌ చేశారు. ఇలా ఈ సీజన్‌లో పది రోజుల్లో ఒక్క జంట బయటపడిందని చెప్పొచ్చు. 

అయితే శ్రీరామచంద్ర, హమీదలని అలా చూసి లోబో పాట పాడటం నవ్వులు పూయించింది. చివర్లో హైలైట్గా మారింది. మరోవైపు మంగళవారం గాయం కారణంగా గేమ్‌కి దూరంగా ఉన్నాడు లోబో. మధ్యలో తన బాధని పంచుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరు మాటలు చెబుతారు గానీ, అవసరం ఉన్నప్పుడు ఎవరూ దగ్గరికి రారని చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు. ఆయన్ని మానస్‌ ఓదార్చారు. 

దీంతోపాటు యాంకర్‌ రవి, శ్రీరామచంద్ర మధ్య చిన్న పాటి వివాదం నడించింది. తనకి సంబంధించి ఓ విషయాన్ని క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు రవి. దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు శ్రీరామచంద్ర. నీ గేమ్‌ నువ్వు ఆడు. కానీ నాతో మైండ్‌ గేమ్‌ ఆడకు. ఈవాళ నీ బిహేవ్‌ నాకు నచ్చలేని ముఖం మీదనే చెప్పారు శ్రీరామచంద్ర. 

మరోవైపు మానస్‌తోనూ ఆయనకు వివాదం అయ్యింది. తాను చెప్పేందుకు ప్రయత్నించానని, కానీ నువ్వు వినేందుకు సిద్ధంగా లేవని మానస్‌ అన్నాడు. దీంతో ఇద్దరు మాట మాట పెరిగి వివాదంగా మారింది. ఏజ్‌లో పెద్దేమోగానీ మెచ్యూరిటీ లేదని శ్రీరామ్‌పై కామెంట్‌ చేశాడు మానస్‌. ఇది కాసేపు హీటుని పెంచింది. నామినేషన్స్ లో లోబోపై ఫైర్‌ అయిన విషయాన్ని స్వేత వర్మ ప్రస్తావిస్తూ ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మొత్తంగా ఈ రోజు గేమ్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios