Asianet News TeluguAsianet News Telugu

ధోనీ ఎవరు.. అని ప్రశ్నిస్తున్న జూలీ బ్యూటీ లక్ష్మీరాయ్

  • జూలీ 2 తో అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాయ్ లక్ష్మీ
  • గతంలో క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీతో డేటింగ్ వ్యవహారం నడిపిన లక్ష్మీరాయ్
  • తాజాగా ధోనీ తెలియదు, ఎవరు  అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న లక్ష్మీ
lakshmi rai asking who is dhoni

తన ఒంపుసొంపులే కాక.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగి ఫేమ్ వచ్చింది హీరోయిన్ రాయ్ లక్ష్మీకి. గతంలో ధోనీతో షికారు చేసినట్లుగా అంతా ఓపెన్ సీక్రెట్ గా చెప్పుకునే లక్ష్మీ రాయ్ ఇపుడు ధోనీ ఎవరంటూ ప్రశ్నిస్తోంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌ల క్వీన్‌గా ముద్ర వేసుకున్న లక్ష్మీ రాయ్... ఇపుడు బాలీవుడ్ చిత్రం "జూలీ 2"తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

నిజానికి ఇటీవలి కాలంలో త‌న గ్లామ‌ర్ షోతో యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ అందాల భామ.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల కంట్లోను ప‌డ్డ ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం 'జూలీ 2' అనే సినిమా చేస్తోంది. 

 

నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ జూలీ మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ‌దాసాని రూపొందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 6న ఈ చిత్రం థియేట‌ర్స్‌లోకి రానుండగా... రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైల‌ర్ కూడా బాగా ఆక‌ట్టుకున్న‌ది. రాయ్ త‌న అందాల‌తో ఈ మూవీలో యూత్‌కి మ‌త్తెక్కించ‌నుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌నుంది. 

 

బాలీవుడ్‌లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్, రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ తెరకెక్కించారు. తాజాగా.. 'జూలీ 2' మూవీ టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సాంగ్‌లోనూ రాయ్ ల‌క్ష్మి త‌న అందాల‌ను ఆరబోసింది. మరి అసలు మసాలా కావాలంటే అక్టోబర్  6 దాకా ఆగాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios