నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ బయోపిక్ పై మొదటి నుండి ఏవొక కామెంట్స్ చేస్తూనే ఉంది ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి. సినిమాలో తన పాత్రని అనుచితంగా చూపిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించింది. 

అలానే చంద్రబాబు నాయుడు పాత్రని పాజిటివ్ యాంగిల్ లో చూపించనున్నారని మండిపడింది. తాజాగా మరోసారి ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆమె స్పందించింది. సినిమాలో ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్య ఫోటోలను రిలీజ్ చేసింది చిత్రబృందం. బాలయ్యలో తనకు ఎన్టీఆర్ కనిపించడం లేదని అంటోంది లక్ష్మీపార్వతి.

''బాలయ్య గెటప్ అచ్చం ఎన్టీఆర్ లా ఉందని అంటున్నారు కానీ నాకు బాలయ్య గెటప్ ఏమాత్రం ఎన్టీఆర్ తో పోలిక ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఎన్టీఆర్ ని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా బాలయ్యని ఎన్టీఆర్ గా అంగీకరించలేకపోతున్నాను. ఎన్టీఆర్ సినిమాలో నిజాలు చెప్తారనే నమ్మకం నాకు లేదు.

ఎన్టీఆర్ గురించి పూర్తి నిజాలు చూపించే ధైర్యం కేవలం వర్మకి మాత్రమే ఉందని'' తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అలానే సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గురించి మాట్లాడే డబ్బు పోసాని కృష్ణమురళికి మాతమే ఉందని తెలిపింది. వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నిర్మాణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సినిమాపై ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని క్లారిటీ ఇచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!