Asianet News TeluguAsianet News Telugu

ముంబై వీధిలో శ్రీదేవి చిన్న కూతురు.. ఫ్యాన్స్ సెల్ఫీల దాడి!

ఇండియన్ బ్యూటిఫుల్ యాక్టర్స్ లో ఒకరైన శ్రీదేవికి వెండితెరపై నటిస్తే గాని ఆమె అందానికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగలేదు. అయితే ఆమె కూతుళ్ళిద్దరికి మాత్రం వెండితెరపైకి రాకముందే మంచి క్రేజ్ పెరుగుతోంది. 

khushi kapoor latest pics viral
Author
Hyderabad, First Published Apr 15, 2019, 6:11 PM IST

ఇండియన్ బ్యూటిఫుల్ యాక్టర్స్ లో ఒకరైన శ్రీదేవికి వెండితెరపై నటిస్తే గాని ఆమె అందానికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగలేదు. అయితే ఆమె కూతుళ్ళిద్దరికి మాత్రం వెండితెరపైకి రాకముందే మంచి క్రేజ్ పెరుగుతోంది. పెద్దకూతురు జాన్వీ మొదటి సినిమాతోనే ఫెమస్ అవ్వగా ఇప్పుడు చిన్న కూతురు ఖుషి కపూర్ ఎంట్రీ ఇవ్వకముందే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

రీసెంట్ గా ముంబై వీధిలో దర్శనమిచ్చిన అమ్మడు జనాల తాకిడిని తట్టుకోలేకపోయింది. పెద్దగా సెక్యూరిటీని కూడా పెట్టుకోకుండా ఓ రెస్టరెంట్ కి వచ్చిన ఖుషి ఫ్యాన్స్ సెల్ఫీల దాడికి నో చెప్పలేక కాస్త ఇబ్బంది పడింది. ఇక ఆమెతో పాటు ధఢఖ్ హీరో ఇషాన్ ఖతార్ అభిమానుల ప్రేమకు ఇబ్బందులు పడక తప్పలేదు. 

ఇక ఖుషి కపూర్ ముంబై వీధిలో సమ్మర్ హాట్ డ్రెస్ లో దర్శనమివ్వడంతో కుర్రాళ్లంతా ఆమె పక్కనే చేరారు. కొంత ఇబ్బంది పడుతూ చివరకు అక్కడి నుంచి అమ్మడు మెల్లగా జారుకుంది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios