Asianet News TeluguAsianet News Telugu

వంద కోట్ల దిశగా కార్తికేయ 2... ఇది ఓ సంచలనం!

 చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ వసూళ్ళు దుమ్ము దులుపుతుంది. ఈ మూవీ ఏకంగా వంద కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. దీనితో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

karthikeya 2 running towards hundred crore mark
Author
First Published Aug 22, 2022, 10:08 PM IST

చాలా కాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్ కి భారీ విజయం దక్కింది. కార్తికేయ 2 సంచలనాలు నమోదు చేస్తుంది. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన ఈ మూవీ బయ్యర్లకు భారీ లాభాలు పంచుతుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కార్తికేయ 2 రికార్డు కలెక్షన్స్ అందుకుంటుంది. అమెరికాలో కార్తికేయ 2 మూవీ వన్ మిలియన్ వసూళ్లు దాటేసింది. రూ. 75 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ఈ మూవీ రాబట్టినట్లు  అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ఈ మూవీ రూ. 100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకుపోతుంది. 

హిందీలో కార్తికేయ 2 గొప్ప విజయం సాధించడం మరో విశేషం. మొదటి రోజుకేవలం రూ. 7 లక్షల వసూళ్లు  అందుకున్న కార్తికేయ 2 ఇప్పటి వరకు రూ. 11 కోట్లకు పైగా వసూళ్లతో ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. హిందీలో కార్తికేయ 2 అతిపెద్ద విజయం నమోదు చేయం ఖాయంగా కనిపిస్తుంది. ఈ విజయాన్ని చిత్ర యూనితో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

2014లో విడుదలైన హిట్ మూవీ కార్తికేయ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి కీలక రోల్ చేశారు. కార్తికేయ 2 ఇంకెన్ని సంచనాలు నమోదు చేయనుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios