Asianet News TeluguAsianet News Telugu

'హీరామండి' లో ఇంత పెద్ద తప్పా(Blunder)?భన్సాలీ చూసుకోలేదా?

 ఈ సిరీస్​లో స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న పరిస్థితులను చూపించారు. ఆ ప్రాంతంలో ఉన్న వేశ్యలు హీరామండి ఉండేవారట. 

Heeramandi Blunder COVID-19 Other Modern Day Stories In Newspaper jsp
Author
First Published May 4, 2024, 4:47 PM IST

వందకి వంద శాతం తప్పులు లేకుండా సినిమాలు తీయడం ఎంత పెద్ద డైరక్టర్ కు అయినా  కష్టమే. ఈ విషయాలను పెద్ద పెద్ద డైరక్టర్ లే బహిరంగంగా  చెబుతుంటారు. అది కొత్త దర్శకుడు తీసినా, పాత దర్శకుడు తీసినా… తెలుగు దర్శకుడు తీసినా, హిందీ దర్శకుడు తీసినా… పొరపాట్లు దొర్లుతాయి. అలా రీసెంట్‌గా విడుదలైన  'హీరామండి' లో సినిమాలో కూడా కొన్ని తప్పులున్నాయని సోషల్ మీడియా జనం పడుతున్నారు. అయితే అవి సినిమాను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ  అయితే సినిమా డైరక్షన్‌ టీమ్‌   సరిగ్గా చూసుకోకపోవడం వల్ల జరిగింది అని చెప్తున్నారు.  'హీరామండి' లో  మేజర్ గా కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిలో సరదాగా ఓసారి చూద్దాం!

నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో హీరామండి వెబ్ సిరీస్ దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మొదటి రోజు నుంచి విశేషంగా చూస్తున్నారు. హిందీలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల ఆడియోల్లోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావటం కలిసొచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ మొదటి వెబ్ సీరీస్ అంతేకాదు మొత్తం తొమ్మిది విదేశీ భాషల్లో కూడా హీరామండి వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది .ఓటిటిలో సంజయ్ లీలా భన్సాలీకి చెందిన మొదటి వెబ్ సిరీస్ హీరామండినే కావడం విశేషం. భారీ బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా అత్యంత అద్భుతంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు సంజయ్ లీలా భన్సాలి. 

  'హీరామండి' లో  వెబ్ సీరిస్ లో ఒక సీన్ లో, సోనాక్షి సిన్హా పాత్ర ఫరీదాన్ ఉర్దూ వార్తాపత్రిక చదువుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు, యూత్ కాంగ్రెస్ ముసుగుల పంపిణీ పథకం వంటి సమకాలీన సంఘటనల గురించి కథనాలు ఉన్నాయని మాజీ జర్నలిస్ట్ ఎత్తి చూపారు. అందులో ఒకటి కోవిడ్-19 గురించిన కథనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

ఇదిలా ఉంటే...  'హీరామండి' లో నటీనటులు ధరించే దుస్తులను కూడా చూసిన వాళ్లు  విమర్శిస్తున్నారు. "భన్సాలీ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ఈ సీరిస్ లో చూపించేటంత  ఆభరణాలను కొనుగోలు చేసేంత డబ్బు, ఆర్థిక భద్రత వేశ్యకి ఎప్పుడూ లేదు. ఈ బ్లౌజులు ఏమిటి? చీరలు? ఘాగ్రాలు? లెహంగాలు? కొన్ని పంజాబీ దుస్తులు ఉండవచ్చా?  ," అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. 

భారీ తారాగణంతో పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్​లో స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న పరిస్థితులను చూపించారు. ఆ ప్రాంతంలో ఉన్న వేశ్యలు హీరామండి ఉండేవారట. ఆ సమయంలో జరిగిన పలు సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రస్తుతం ఈ సిరీస్​కు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios