Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ఫ’లాగే బాలీవుడ్ లో ఇరగదీస్తున్న ‘కార్తికేయ 2’.. నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ దూకుడుగా వ్యవహరిస్తోంది. నార్త్ లో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ఫ’తో పోల్చుతూ అక్కడ ఇరగదీస్తోందన్నారు. 
 

Karthikeya 2 Movie is being released in Bollywood Like Pushpa, Producer Allu Aravind interesting comments
Author
Hyderabad, First Published Aug 16, 2022, 6:05 PM IST

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) - అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన  మైథలాజికల్  ఫిల్మ్ ‘కార్తికేయ 2’ (karthikeya 2). ఆగస్టు 13న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఊహించని రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లోనూ చిన్న సినిమాగా వచ్చిన ‘కార్తికేయ 2’ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కేవలం మూడు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

తెలుగు సినిమా ‘కార్తికేయ 2’కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటం సంతోషకరం. ముఖ్యంగా ఈ చిత్రం బాలీవుడ్ లో అదిరిపోయే రెస్పాన్స్  ను సొంతం చేసుకుంటోంది. అప్పుడు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ఫ’ (Pushpa) తరహాలో మొదట స్లోగా స్టార్ట్ అయ్యి చివరికి ఇరగదీసింది. ఇప్పుడు ‘కార్తికేయ 2’ హిందీలో ఇరగదీస్తోంది. మరింత స్పందన అందాలని, ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని అన్నారు. చిత్ర యూనిట్ కు, మేకర్స్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ అల్లు అరవింద్ మాటలను కోట్ చేస్తూ ఇన్ స్టా ద్వారా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశారు. ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మొత్తం యూనిట్ ను అభినందించిన విషయం తెలిసిందే. 

హిందీ వెర్షన్ లో ఈ చిత్రం మూడో రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.  తొలిరోజు రూ. 7 లక్షలు, రెండో రోజు రూ.28 లక్షలు, మూడో రోజు రూ.1.10 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాల నివేదికలు తెలుపుతున్నాయి.  ఇదే విషయాన్ని సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ కూడా కన్ఫమ్ చేశారు. హిందీ బెల్డ్ లో ‘కార్తీకేయ 2’ వసూళ్లు తొలిరోజుతో పోల్చితే 292 శాతంగా ఉందని తెలిపారు. అతి తక్కువ స్క్రీన్లలో ఆడియనా ఇంతటి వసూళ్లను రాబట్టడం సెన్సేషన్ అని అభిప్రాయపడ్డారు. ఇక ఈ మూడు రోజుల్లో కార్తీకేయ 2కు ప్రపంచ వ్యాప్తంగా రూ.15.44 కోట్ల షేర్ (రూ.26.50 కోట్ల గ్రాస్) దక్కింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బాక్సాఫీస్ వద్ద మరింత జోరు పెంచింది. వచ్చే వీకెండ్ కల్లా ‘కార్తికేయ 2’ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో నిఖిల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నిఖిల్ సరసన ఆడిపాడింది. ‘కార్తికేయ’కు సీక్వెల్ గా వచ్చిన ‘కార్తికేయ 2’కు  చందూ మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.   అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios