'మా ఇద్దరి మధ్య' అనే సినిమాతో 2007లో  తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ విదిషా శ్రీవాస్తవ. అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం లేదు. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ మూడు పదులు దగ్గరపడుతున్నా ఇంకా అవకాశాల కోసం ఇలా హాట్ గా ఫోటో షూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తోంది.      

జనతా గ్యారేజ్ లో ఉన్ని ముకుందన్ సరసన ఒక చిన్న పాత్రలో కనిపించిన  విదిషా అనంతరం ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక హిందీ టివి సీరియల్స్ లో వచ్చిన పాత్రలు చేసుకుంటూ పోతున్న ఈ ముద్దగుమ్మ అప్పుడపుడు తన గ్లామర్ తో సోషల్ మీడియానీ ఇలా హీటెక్కిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా విదిషా  బికినీలా ఉండే రెడ్ మోనోకినిలో వయ్యారంగా నిలబడి  ప్రతి ఒక్కరిని ఫిదా అయ్యేలా చేస్తోంది. 

స్విమ్మింగ్ ఫుల్ లో మంచి వ్యూలో స్టిల్ ఇచ్చిన ఈ నార్త్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. మరి ఈ స్టిల్స్ తో బేబీ ఎంతవరకు అవకాశాలు అందుకుంటుందో చూడాలి. రీసెంట్ గా విదిషా తమిళ్ లో ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.