Asianet News TeluguAsianet News Telugu

ఏంటి.. కాజల్‌కి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యిందా?

అందుకే మ్యారేజ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ మిత్రవింద చేసుకోబోయే వాడు ఫిక్స్ అయ్యాడని, గౌతమ్‌ అనే వ్యాపారవేత్తని వివాహమాడబోతుందని తెలుస్తుంది.

it is learned that kajal has got an engagement
Author
Hyderabad, First Published Aug 17, 2020, 9:42 AM IST

కాజల్‌ పెళ్ళికి సంబంధించిన వార్తలు గతేడాది నుంచి వినిపిస్తున్నాయి. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తని పెళ్ళాడబోతుందనే న్యూస్‌ సోషల్‌ మీడియాలో హల్‌ హల్‌ చేస్తూనే ఉంది. సినిమాలు కాస్త తగ్గిపోతున్న నేపథ్యంలో కాజల్‌ కూడా పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్‌ అయిపోవాలని భావిస్తుందని అంటున్నారు.

నిజానికి కాజల్‌కి యంగ్‌ హీరోలతో నటించే అవకాశాలు రావడం లేదు. వచ్చినా అవి అంత క్రేజీ ప్రాజెక్ట్ లు కావు. దీంతో సీనియర్లకే పరిమితవుతుంది. తాను సీనియర్‌గా మారినట్టే సీనియర్లకు ఆమె తప్ప ఆల్టర్‌నేట్‌ కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ చందమామ చిరంజీవి, కమల్‌ హాసన్‌లతో నటిస్తుంది. చిరంజీవితో `ఆచార్య`లో, కమల్‌ హాసన్‌తో `భారతీయుడు 2`లో నటిస్తుంది. దీంతో సీనియర్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ని వేసుకున్న ఈ అమ్మడు ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పాలని భావిస్తుందట. 

అందుకే మ్యారేజ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ మిత్రవింద చేసుకోబోయే వాడు ఫిక్స్ అయ్యాడని, గౌతమ్‌ అనే వ్యాపారవేత్తని వివాహమాడబోతుందని తెలుస్తుంది. ఇందులో అభిమానులు, నెటిజన్లు, సినీ వర్గాలు సైతం షాక్‌ అయ్యే విషయం ఏంటంటే కాజల్‌ ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తయ్యిందని టాక్. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

మరి ఈ వార్తలో నిజముందా? లేక ఎప్పటిలాగే కేవలం రూమర్ గానే మిగిలిపోతుందా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం కాజల్‌ `ఆచార్య`, `భారతీయుడు 2`తోపాటు `మోసగాళ్ళు`, `ముంబయి సాగా`,`హే సినామిక` చిత్రాల్లో నటిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios