ఏ సినిమాకైనా క్లైమాక్స్ ప్రాణం. సినిమా అప్పటిదాకా ఎలా ఉన్నా..క్లైమాక్స్ లో దుమ్ము దులిపితే అది చంద్రముఖి స్దాయి చేరుకుంటుందని సినీ పండితులు చెప్తూంటారు. అందుకే సినిమా వాళ్లు క్లైమాక్స్ ని స్పెషల్ గా డిజైన్ చేస్తూంటారు. ఆ క్లైమాక్స్ చూసి థియోటర్ లోంచి బయిటకు వెళ్లే ప్రేక్షకుడు ...సినిమా గురించి పాజిటివ్ గా చెప్పాలంటే ఆ స్దాయి మరో స్దాయిలో ఉండాలి. అందుకేనేమో కేజీఎఫ్ 2 చిత్రం క్లైమాక్స్ కూడా అలాంటి ఎమోషన్స్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం షాక్ ఇస్తుందని చెప్తున్నారు. అక్టోబర్ 23న రిలీజ్ అయ్యే ఈ సినిమాలో మైండ్ బ్లాక్ అయ్యే ఆ మేజర్ ట్విస్ట్ ఏమిటో చూద్దాం.

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారంటూ వార్తలు సైతం వస్తున్నాయి.  

ఈ సినిమా క్లైమాక్స్లో హీరో యష్ ని చంపేస్తారట. ఇండియా ప్రైమ్ మినిస్టర్ గా కనిపించే రవీనా టండాన్..ఈ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందని చెప్తున్నారు. మిలిట్రీ ఫోర్స్ ల సాయింతో యష్ ని చంపేస్తుందంటున్నారు. అయితే ఇది కేవలం కన్నడ పరిశ్రమలో వినిపిస్తోన్న వార్త మాత్రమే. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు పై క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఆ మధ్యన ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగింది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసారు. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. క్లైమాక్స్ కి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారట. ఇక్కడ చిత్రీకరించే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. అయితే ఏం షూట్ చేసినా కరోనా ఎఫెక్ట్ తర్వాతే. అంటే మరికొంత సమయం పడుతుంది.