Asianet News TeluguAsianet News Telugu

సలార్ లో డర్టీ హరి హీరోయిన్? ఇంతకీ రోల్ ఏంటీ?

సలార్ గ్యాంగ్ లో ఊహించని నటి జాయిన్ అయ్యింది. ఈ మేరకు షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సిమ్రత్ కౌర్ నటిస్తున్నారట. 
 

heroine simrat kaur joins salaar sets shakes legs with prabhas ksr
Author
First Published Nov 9, 2023, 3:20 PM IST

సలార్ మూవీ విడుదలకు రెండు నెలల సమయం కూడా లేదు. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉందట. ప్రభాస్ లేకుండా ఓ పది రోజులు ఇతర నటుల మీద చిత్రీకరణ జరిగిందని సమాచారం. తాజాగా ఓ ఐటెం సాంగ్ షూట్ చేస్తున్నారట. సలార్ లో ఐటెం సాంగ్ పెట్టాలనేది దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచన. అయితే మోకాలి సర్జరీ కోసం ఆయన విదేశాలకు వెళ్లారు. దీంతో ఐటెం సాంగ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. 

నిన్న ప్రభాస్ ఇండియా వచ్చారు. వచ్చిన వెంటనే సలార్ సెట్స్ లో జాయిన్ అయ్యాడట. ఇక ఐటెం భామగా సిమ్రత్ కౌర్ ని ఎంపిక చేశారట. ప్రభాస్ పక్కన ఆమె కాలు కడపనుందని విశ్వసనీయ సమాచారం. సిమ్రత్ కౌర్ ఇటీవల భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిన గదర్ 2 చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. అమీషా పటేల్ మరో హీరోయిన్. గదర్ 2 వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. 

కాగా సిమ్రత్ కౌర్ కెరీర్ మొదలైంది తెలుగులోనే. 2017లో విడుదలైన ప్రేమతో మీ కార్తీక్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. సీనియర్ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించిన డర్టీ హరి చిత్రంలో బోల్డ్ రోల్ చేసింది. ఇక 2022 సంక్రాంతి విన్నర్ బంగార్రాజు మూవీలో గెస్ట్ రోల్ చేసింది. సలార్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios