Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరో ఇంట్లో అద్దెకు ఉంటున్న ప్రభాస్ హీరోయిన్ శ్రద్దా కపూర్! కారణం ఏమిటో తెలుసా?


హీరోయిన్ శ్రద్దా కపూర్ ఓ స్టార్ హీరో ఇంట్లో అద్దెకు దిగిందట. సొంత ఇల్లు వదిలి ఆమె అద్దెకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే సందేహం అభిమానుల్లో మొదలైంది. అందుకు కారణం ఇది అట!
 

heroine shraddha kapoor rented hrithik roshan house ksr
Author
First Published Aug 28, 2024, 8:09 PM IST | Last Updated Aug 28, 2024, 8:09 PM IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో శ్రద్దా కపూర్ ఒకరు. ఆమె లేటెస్ట్ మూవీ స్త్రీ 2 బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఆగస్టు 15న ఈ హారర్ కామెడీ విడుదలైంది. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. పంకజ్ త్రిపాఠి ఓ కీలక రోల్ చేశాడు. స్త్రీ 2 రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. స్త్రీ 2 బాక్సాఫీస్ రన్ ముగిసేనాటికి భారీ ఫిగర్ నమోదు కావడం ఖాయం. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి ఇది సీక్వెల్. అనురాగ్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. 

స్త్రీ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది శ్రద్దా కపూర్. సాహో చిత్రం ద్వారా శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2019లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కి జంటగా ఆమె నటించారు. సౌత్ లో సాహో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే హిందీ వెర్షన్ సూపర్ హిట్ కొట్టింది. రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. స్టైలిష్ రోల్ లో శ్రద్దా కపూర్ అదరగొట్టింది. 

కాగా శ్రద్దా కపూర్ ఓ స్టార్ హీరో ఇంటికి మకాం మార్చిందన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఇంట్లో శ్రద్దా కపూర్ అద్దెకు దిగిందట. శ్రద్దా కపూర్ కి సొంత ఇల్లు ఉంది. మరి హృతిక్ ఇంటిని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఏమిటన్న వాదన తెరపైకి వచ్చింది. అందుకు ఒక కారణం ఉంది. 

శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ సీనియర్ నటుల్లో ఒకరు. ఆయన 1987లో ముంబై జూహు ఏరియాలో ఓ ఇల్లు కొన్నారట. అక్కడే శ్రద్దా కపూర్ ఉండేది. అయితే ఆ ఇంటిని రేనోవేషన్ చేయించాలని శక్తి కపూర్ భావించారట. దాంతో శ్రద్దా కపూర్ ఇల్లు మారాల్సి వచ్చింది. ఇంటి పునరుద్ధరణ పూర్తి అయ్యాక తిరిగి వెళ్ళిపోతుందట. అదన్నమాట సంగతి... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios