Asianet News TeluguAsianet News Telugu

నాగచైతన్య, సమంతల వివాహానికి ఆహ్వానితుల లిస్ట్ రెడీ

  • అక్టోబర్ 6న వైభవంగా సమంత,నాగచైతన్యల వివాహం
  • గోవాలో జరిగే పెళ్లి వేడుకకు 175 మందికి ఆహ్వానం
  • అక్కినేని వారి గెస్ట్ లిస్ట్ లో మెగా ఫ్యామిలీ
guest list ready for samantha nagachaitanya wedding

టాలీవుడ్ ప్రేమ పక్షులు సమంత, నాగచైతన్యల ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ అక్టోబర్ 6న పెళ్లి. వివాహం అతి కొద్ది మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చేసుకుంటున్న ఈ జంట గోవాలో జరిగే వివాహానంతరం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనుంది. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా గడిపేస్తున్నారు.

 

తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య, సమంతల పెళ్లికి 175 మందిని అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. గోవాలో జరిగే ఈ వేడుకలో 175 మంది గెస్టులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

 

అక్టోబర్ 5 నుంచి వివాహ వేడుకకు సంబంధించిన పూజాధిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇక అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు వివాహ వేడుకల్లో భాగంగా పలు రకాల పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వేడుక జరుగుతుంది.

 

ఇక అక్టోబర్ 10న అక్కినేని కుటుంబం పెద్దయెత్తున నిర్వహించనున్న రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ రిసెప్షన్ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలతోపాటు ఇతర సన్నిహితులు పాల్గొననున్నారు. ఇక ఈ గెస్ట్ లిస్ట్ లో మెగా ప్యామిలీ కూడా వుందని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios