Asianet News TeluguAsianet News Telugu

'కేజీఎఫ్‌' తెలుగు ఫ్యాన్స్ కు శుభవార్త

కన్నడ చిత్రం, కెజిఎఫ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదల చేసిన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్. ఆ సినిమా 2019 డిసెంబర్ లో విడుదలయ్యింది. రిలీజి అయ్యి ఇంత కాలమైనా ఆ సినిమా నిర్మాతలు తెలుగు వెర్షన్  శాటిలైట్ రైట్స్ ను ఇప్పటి వరకు అమ్మలేదు.

 

Finally KGF Satellite Rights Sold
Author
Hyderabad, First Published Jun 24, 2020, 4:53 PM IST

కన్నడ హీరో యశ్ హీరోగా వచ్చిన  ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ తెలుగులో భారీ విజయం సాధించింది. ఓ కన్నడ డబ్బింగ్ సినిమా ఆ స్దాయి సక్సెస్ సాధించటం పెద్ద వింత. అన్ని భాషల్లోనూ ఆ సినిమా కలెక్షన్స్ ఓ రేంజిలో అదరకొట్టాయి.  ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంత స్దాయిలో హిట్ కొట్టిన సినిమాకు శాటిలైట్ రేట్ ఏ రేంజిలో పలుకుతుందో చెప్పక్కర్లేదు. కానీ ఎందుకనో కేజీఎఫ్ నిర్మాత ఇంతకాలం శాటిలైట్ డీల్ చేయలేదు. తను అనుకున్న రేటు తెలుగు టీవి ఛానెల్స్ చెల్లించలేదని ఆగారని వార్తలు వచ్చాయి. అయితే ఈ స‌మ‌యంలో తెలుగు లోక‌ల్ ఛానెల్ ఈ చిత్రాన్ని ప్ర‌సారం చేసేసింది. దాంతో ఇంతకాలానికి స్టార్ మా టీవీ ఈ శాటిలైట్ రైట్స్ ని  లాక్ చేసింది. 

ఎంతకు లాక్ చేసారనే విషయం బయిటకు రాలేదు కానీ ఫాన్సీ మొత్తానికి లభించిందని టీవీ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ టీవీ ప్రీమియర్ కోసం స్టార్ మా త్వరలో రెడీ అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘కేజీఎఫ్ 2’ టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. అక్టోబర్ లో రిలీజ్ కానున్న ఈచిత్రం కోసం అమెజాన్ ప్రైమ్ భారీ ధరకి దక్కించుకుంది . ఎన్నడూ లేని విధంగా ఓ దక్షిణ భారత చిత్రానికి 55 కోట్లను చెల్లించినట్టు సమాచారం. ఈ చిత్రం దసరా కోసం విడుదల కావాల్సి ఉంది కాని కరోనా బ్రేక్ కారణంగా ఇది వాయిదా పడే అవకాశం ఉంది. దాదాపు ఈ సినిమా వచ్చే ఏడాది వరకు వాయిదా పడింది. షూటింగ్ పునః ప్రారంభించిన తర్వాతే విడుదల తేదీపై క్లారిటీ వస్తుంది. ఈ సినిమా మీద చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్ లో మార్కెట్ కోసం సంజయ్ దత్ ని కీలక పాత్ర కోసం తీసుకున్నారు. కేజీఎఫ్ 2 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కావాల్సి ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios