మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'వినయ విధేయ రామ'. నిన్న ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. హీరోయిజంతో నిండిపోయిన ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే టీజర్ 15 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ని సాధించింది. అంతగా టీజర్ కి భారీ స్పందన వస్తుంటే ఈ సినిమాకి సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ని మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన స్కోర్ ఇదివరకే విన్నట్లు ఉందని నెటిజన్లు వాదిస్తున్నారు.

కొందరు శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ సినిమాలకు అందించిన స్కోర్ లను కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'వినయ విధేయ రామ' స్కోర్ కూడా అలానే ఉందంటూ దేవిపై విమర్శలు చేస్తున్నారు. ఆ సినిమాల మ్యూజిక్ కొంతవరకు మ్యాచ్ కావడంతో దేవిపై ట్రోలింగ్ ఆగడం లేదు.

తన సినిమాల నుండే దేవిశ్రీప్రసాద్ కాపీ కొట్టాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దేవిశ్రీపై ఈ రకమైన ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరగడం ఇదే మొదటిసారి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది!

ఇవి కూడా చదవండి..

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!