సౌత్ ఇండస్ట్రీలో సంచలన సృష్టించిన జంట దర్శకుడు ఏఎల్ విజయ్‌, వివాదాస్పద హీరోయిన్ అమలా పాల్‌ ది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. డైవర్స్‌ సమయంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొవటంలో అప్పట్లో న్యూస్‌ హెడ్ లైన్స్‌గా మారింది. అయితే విడాకుల తరువాత విజయ్‌ వెంటనే మరో వివాహం చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యాడు.

ఐశ్వర్య అనే యువతిని పెళ్లి చేసుకున్న విజయ్ తిరిగి సినిమాల్లో బిజీగా అయ్యాడు. తాజాగా మరోసారి విజయ్‌ వ్యక్తిగత జీవితం వార్తల్లోకి వచ్చింది. శనివారం ఏఎల్ విజయ్‌, ఐశ్వర్యల జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మగబిడ్డ  జన్మనిచ్చింది ఐశ్వర్య విజయ్‌. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న విజయ్‌ సోదరుడు, నటుడు ఉదయ్‌, తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టుగా వెల్లడించారు.

`ఈ రోజు ఉదయం 11 గంటల 25 నిమిషాలకు విజయ్, ఐశ్వర్యలకు మగబిడ్డ పుట్టాడు. చాలా ఆనందంగా ఉంది` అంటూ ట్వీట్ చేశాడు ఉదయ్‌. 2017లో అమలాపాల్‌ నుంచి విడిపోయిన తరువాత డాక్టర్ ఐశ్వర్యను వివాహం  చేసుకున్నాడు విజయ్‌. అమలాపాల్ మాత్రం తోడు కోసం ఎదురుచూడకుండా సినిమాలతో బిజీ అయ్యింది. డైవర్స్ తరువాత గ్లామర్‌ షోలోనూ హద్దులు చెరిపేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.