MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • ప్రతి ఇంట్లో కామన్ గా తల్లులు చేసే తప్పులు ఇవే...!

ప్రతి ఇంట్లో కామన్ గా తల్లులు చేసే తప్పులు ఇవే...!

 ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే చూస్తుంది. కానీ.. తెలిసీ తెలియక తల్లులు చేసే కొన్ని పనులు బిడ్డల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : May 08 2024, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది మరోటి లేదని చెప్పొచ్చు. తల్లి, తమ పిల్లల కోసం చాలా చేస్తుంది.  తాను ఆకలితో ఉన్నా.. తమ బిడ్డల ఆకలి తీరుస్తుంది.  తాను నిద్రపోకున్నా.. తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటుంది.  దాదాపు మన దేశంలో ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే చూస్తుంది. కానీ.. తెలిసీ తెలియక తల్లులు చేసే కొన్ని పనులు బిడ్డల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తమ బిడ్డల విషయంలో తల్లి తప్పు చేయడం ఏంటి అనే అనుమానం మీకు కలగొచ్చు. కానీ.. డైరెక్ట్ గా కాకపోయినా.. పొరపాటున అనే కొన్ని మాటలు చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అవేంటి..? పిల్లల ముందు తల్లి ఎలాంటి మాటలు మాట్లాడకూడదో ఓసారి చూద్దాం...
 

35

తల్లులు పిల్లలతో కాస్త స్ట్రిక్ట్ గా ఉండొచ్చు తప్పులేదు. కానీ కఠినంగా మాత్రం ఉండకూడదు. పిల్లలకు ప్రతి విషయంలో రూల్స్ పెట్టి... దానికి తగినట్లే ఉండాలి అని అనకూడదు. తల్లులు పిల్లలతో కాస్త సున్నితంగా ఉండాలి. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే విషయాన్ని పిల్లలకు చాలా స్పష్టంగా తెలియజేయాలి. మరీ ఎక్కువ కఠినంగా ఉంటే... పిల్లలతో మీ బంధం సరిగా ఉండకపోవచ్చు.కాబట్టి... ఆ పొరపాటు చేయకండి. 

45


చాలా మంది తల్లులు... తమ మాట వినడం లేదని... తమ పిల్లలను తిడుతూ ఉంటారు. కానీ... మీరు అలా ఎక్కువగా తిట్టడం, అరవడం లాంటివి చేయడం వల్ల... వాటిని భరించలేక పిల్లలు మీకు దూరమైపోతూ ఉంటారు. ఆ పొరపాటు కూడా చేయకూడదు.
 

అంతేకాదు.. ఎక్కువ మంది తల్లులు చేసే పని ఏంటంటే.... పిల్లలు ఏదైనా చేయగానే వెంటనే మీ నాన్నకు చెబుతాను అని భయపెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల   పిల్లల దృష్టిలో తల్లి గౌరవం ఆటోమేటిక్‌గా తగ్గడం ప్రారంభమవుతుంది, ఎందుకంటే పిల్లలు తమ తల్లి ఒంటరిగా ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోలేరని భావిస్తారు. మీరు కూడా ఇలాగే చేస్తే పిల్లల పెంపకంలో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి వెంటనే మీ ఈ అలవాటుకు స్వస్తి చెప్పాలి.

55
Mother daughter

Mother daughter

మనలో చాలా మంది తల్లులు మన పిల్లల మాట వినకుండా, వారితో బహిరంగంగా మాట్లాడకుండా వారికి సూచనలు మాత్రమే ఇస్తున్నారు. నిజానికి ఇలా చేయడం తప్పు. మీరు మీ పిల్లలతో మాట్లాడాలి. వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించాలి. పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు ఎప్పుడూ సూచనలు ఇవ్వడమే కాదు... వారితో చక్కగా మాట్లాడాలి.


ఇక కామన్ గా చాలా మంది తల్లులు చేసే మరో తప్పు ఏంటంటే...  తమ పిల్లలను పక్కవారితో పోలుస్తూ ఉంటారు. ఒక్కోసారి పిల్లల లోపాలను ఎత్తి చూపి పక్కవారి పిల్లలతో పోల్చడం మొదలుపెడతాం, కొన్నిసార్లు అతని మార్కులు బాగా వచ్చినప్పుడు అదే తరగతికి చెందిన మరో పిల్లవాడితో పోల్చి చూస్తాం. ఇది మాత్రమే కాదు, చాలా మంది తల్లులు తమ ఇతర పిల్లలతో తమను తాము పోల్చుకోవడం ప్రారంభిస్తారు. వాస్తవానికి, ఇలా చేయడం వల్ల పిల్లల మనస్సులలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది పిల్లలను చాలా మానసికంగా దెబ్బతీస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: సెలబ్రిటీలు పిల్లలకు తమ స్టార్ డమ్ గురించి ఎందుకు చెప్పరు?
Recommended image2
Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే తల్లిదండ్రులు ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే
Recommended image3
Parenting: పిల్లలు పేరెంట్స్ దగ్గర సీక్రెట్స్ ఎందుకు దాస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved