Asianet News TeluguAsianet News Telugu

Dhamaka Trailer : మాస్ జాతర అంటే ఇదే.. అదిరిపోయిన ‘ధమాకా’ట్రైలర్!

మాస్ మహారాజా రవితేజ - శ్రీలీలా జంటగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్  ‘ధమాకా’ నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ విడుదలైంది. మాస్ యాక్షన్, అదిరిపోయే డైలాగ్స్ తో ట్రైలర్ కట్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 
 

Dhamaka Movie Trailer Released!
Author
First Published Dec 15, 2022, 7:31 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరో,  మాస్ మహారాజ రవితేజ (Raviteja) తాజాగా నటించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sree Leela) రవితేజ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. రిలీజ్ టైం దగ్గరికి వస్తుండటంతో తాజాగా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. 

తాజాగా, ‘ధమాకా’ నుంచి మాస్ అండ్ పవర్ ఫుల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో..  మాస్ మహారాజ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ధ్విపాత్రినభినయంతో అలరించబోతున్నాడు. మాస్ అండ్ క్లాస్ లుక్ లో చూపించిన వేరియేషన్ ఆకర్షణీయంగా కనిపించనుంది. ట్రైలర్ లోని మాస్ డైలాగ్ లు, పంచ్ లు,  రవితేజ మేనరిజం, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దుమ్ములేచిపోయింది. మొత్తంగా మాస్ జాతర రాబోతుందని చెప్పొచ్చు. ట్రైలర్ కట్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. 

ఇఫ్పటికే చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక మధ్యమధ్యలో వచ్చిన సాంగ్స్ కు కూడా క్రేజీ రెస్పాన్స్ అందింది. తాజాగా ట్రైలర్ కూడా దూసుకుపోతుండటంతో సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించారు. తనికెళ్ల భరణి, రావు రమేశ్, అలీ, హైపర్ ఆది, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 
డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios