Asianet News TeluguAsianet News Telugu

చిక్కుల్లో పడ్డ దీపిక-రణవీర్ ల పెళ్లి!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక, రణవీర్ లు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసి ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 14,15 తేదీల్లో ఇటలీలో అట్టహాసంగా వీరి వివాహం జరిగింది. కొంకణి, సింధి సంప్రదాయాల్లో వీరికి పెళ్లి జరిగింది. వివాహం జరిగిన తరువాత ఆదివారం నాడు ఈ జంట ముంబై చేరుకుంది.

Deepika and Ranveer land in trouble over Anand Karaj wedding in Italy
Author
Hyderabad, First Published Nov 20, 2018, 10:30 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక, రణవీర్ లు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసి ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 14,15 తేదీల్లో ఇటలీలో అట్టహాసంగా వీరి వివాహం జరిగింది. కొంకణి, సింధి సంప్రదాయాల్లో వీరికి పెళ్లి జరిగింది.

వివాహం జరిగిన తరువాత ఆదివారం నాడు ఈ జంట ముంబై చేరుకుంది. ప్రస్తుతం వీరు తమ సన్నిహితులు, స్నేహితులు, ఇండస్ట్రీ సభ్యుల కోసం భారీ విందు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనుల్లో తలమునకలై ఉన్న ఈ జంటకి ఓ షాక్ తగిలింది. వీరి వివాహంపై ఓ వివాదం చెలరేగింది.

వివాహమనంతరం నిర్వహించిన 'ఆనంద్ కరాజ్' కార్యక్రమం సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆనంద్ కరాజ్ కార్యక్రమం సిక్కు సంప్రదాయాలప్రకారం జరగలేదని ఈ సంస్థ ఆరోపణలు చేస్తోంది.

సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి మరీ దానిని నిర్వహించారని పేర్కొంది. సిక్కుల పవిత్ర గ్రంధం 'గురు గ్రంథ్ సాహిబ్'ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదన్న విషయాన్ని ఉల్లఘించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని 'అకల్ తఖ్త్ జతేదార్'  దృష్టికి తీసుకెళ్లినట్లు సంస్థ అధ్యక్షుడు తెలిపారు. 

ఇవి కూడా చదవండి.. 

దీపిక,రణవీర్ లు ఉండబోయే ఇల్లు ఖరీదు ఎంతంటే..?

దీపిక వెడ్డింగ్ రింగ్ రేటెంతో తెలుసా..?

ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటైన రణ్ వీర్ - దీపిక..రేపు మరో పెళ్లి!

కత్రినాకి దీపిక వెడ్డింగ్ కార్డ్ అందలేదు.. ఎందుకంటే..?

ఇటలీకి వెళ్తూ కెమెరాకి చిక్కిన ప్రేమజంట!

70కోట్లతో హీరో హీరోయిన్ కొత్త ఇల్లు!

దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!

Follow Us:
Download App:
  • android
  • ios