సిట్ బృందాన్ని ఆమె ఇంటరాగేట్ చేసి వచ్చినట్లుందని వర్మచార్మి ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించిందన్న వర్మవర్మకు మరింత ఆహ్లాదంగా కనిపించిన చార్మి

డ్రగ్స్ కేసుపై సంచలన కమెంట్స్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తన చేతుల గులగుల నిరూపించారు. అకున్ సభర్వాల్ తో బాహుబలి 3 సినిమా తీస్తున్నారన్న వర్మ తాజాగా.. చార్మి విచారణ అనంతరం ఫేస్ బుక్ లో ఆసక్తికర కమెంట్స్ చేశారు.

చార్మి విచారణ కు వెళ్లి వస్తున్నప్పుడు ఝాన్సీ లక్ష్మిబాయిలా కనిపించిందన్నారు వర్మ. అంతే కాక తాను విచారణకు వెళ్తున్నప్పటికంటే వచ్చినప్పుడు మరింత అందంగా కనిపించిందని.. తన గోర్లు తీసుకుంటారనుకుంటే.. కూల్ గా చార్మి మేనిక్యూర్ చేయించుకున్నట్లుగా, ముఖాన మరింత మేకపే వేసుకున్నట్లుగా మెరిసిపోయిందని వర్మ అభివర్ణించారు.

అంతే కాక చార్మి తిరిగి వచ్చినప్పుడు ముఖంలో కనిపించిన ఆనందం చూస్తే.. ఆమెనే సిట్ అధికారులను విచారించినట్లుగా కనిపించిందని వర్మ అభిప్రాయపడ్డాడు. అంతటితో ఆగక వివాదాస్పద రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ డ్రగ్స్ కు వ్యతిరేకంగా రాసిన ఓ కథనాన్ని ఎఫ్.బి.లో పోస్ట్ చేశాడు.