Asianet News TeluguAsianet News Telugu

రెడీగా ఉండండి ‘బ్రో’.. ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ఈనెలలోనే రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదలకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. 
 

Bro The Avatar Movie Trailer release Date fix NSK
Author
First Published Jul 21, 2023, 9:06 AM IST

మామాఅల్లుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ (BRO). తమిళ స్టార్ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా తెలుగులో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు.

‘బ్రో : ది అవతార్’  చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ కావడంతో యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఆసక్తికరమైన పోస్టర్లు, పాటలు, టీజర్ విడుదలై ఆకట్టుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు, తేజూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ట్రైలర్ ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ను అందించారు. 

Bro Trailer రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జూలై 22న అంటే రేపు ఈ మూవీ పవర్ ఫుల్ ట్రైలర్ విడుదల కాబోతోందని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సముద్రఖని మార్క్, పవన్ కళ్యాణ్ న్యూ స్టైలిష్ లుక్, తేజూ స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తో రాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, మేకర్స్ ‘బ్రో’ మూవీ ప్రమోషన్స్ విషయంలో కాస్తా వెనకబడి ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాస్తా స్పీడ్ పెంచండి అంటూ కోరుతున్నారు. ఇక ట్రైలర్ కూడా రాబోతుండటంతో ఆ తర్వాతనైనా మరింత జోరుగా ప్రమోషన్స్ చేస్తారని భావిస్తున్నారు. చిత్రంలో పవన్, తేజూ ప్రధాన పాత్రలు పోషించగా.. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. జూలై 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios