Asianet News TeluguAsianet News Telugu

‘మాస్ట్రో’: హాట్ సీన్స్ గురించి ఇలా లీక్ చేసేసిందేంటి?

 ‘మాస్ట్రో’ని మాత్రం 42 రోజుల్లోనే పూర్తి చేశా. ‘అంధాదున్‌’ చూడగానే సినిమాలోని థ్రిల్లింగ్‌ అంశాలు బాగా నచ్చాయి. నేర నేపథ్యం, హాస్యం ఆకట్టుకుంది. రీమేక్‌ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అప్పుడు అనిపించింది. 

Bold Scenes Removed From Maestro?
Author
Hyderabad, First Published Sep 14, 2021, 10:59 AM IST


 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ.ఆయన తాజాగా నితిన్‌ హీరోగా ‘మాస్ట్రో’ సినిమాని తెరకెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 17న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో సీన్లలో హాట్ డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా హాట్ సీన్స్ ఉన్నాయా లేవా అన్నది జనాల ప్రశ్నగా మారింది. 

ఎందుకంటే...బాలీవుడ్ లో హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ గా తెలుగులో వస్తోంది ఈ  మాస్ట్రో మూవీ. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా నటేష్ చేసింది. హిందీలో రాధిక ఫుల్ గ్లామరస్ మీల్ గా అదరకొట్టింది. ముఖ్యంగా, కొన్ని సీన్స్ లో చాలా హాట్ గా, బోల్డ్ గా కూడా చేసింది. హీరోతో లిప్ లాక్ లు,హాట్ సీన్స్ కూడా ఉన్నాయి. దాంతో ఓ వర్గం రీమేక్ కాబట్టి ఖచ్చితంగా ఆ సీన్స్ ని తెలుగులో కూడా పెట్టే ఉంటారని భావించింది. అయితే నభా మాత్రం క్లారిటీ ఇచ్చేసింది.
 
నభా మాట్లాడుతూ....మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా మార్పులు చేశారు. స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. గత చిత్రాలకు భిన్నంగా నా పాత్రచిత్రణ, లుక్‌ నవ్యరీతిలో ఉంటాయి. నా కెరీర్‌లో తొలి రీమేక్‌ ఇది. నా క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు? ఒరిజినల్‌తో పోల్చుతారా? లేదా? అనే సందేహాలున్నాయి. హిందీలో రాధికా ఆప్టే నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను. రీమేక్‌లో నటించే అవకాశం రాగానే మళ్లీ మాతృకను చూడకూడదని నిర్ణయించుకున్నా. ఒరిజినల్‌ పాత్ర ప్రభావం లేకుండా నా శైలిలో పాత్రకు న్యాయం చేశాను. కథలోని సోల్ మాత్రం అలానే ఉంటుంది అని తేల్చి చెప్పింది. ఇది విన్న వారంతా ఈ సినిమాలో నభా పాత్రపై ఓ క్లారిటీకు వచ్చేసారు. ఆమె పాత్ర బోల్డ్ గా ఉండదని అర్దమైపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios