బిగ్‌బాస్‌4 సీజన్‌ ప్రారంభం నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తెలుగులో మాట్లాడాలని నాగ్‌ కండీషన్‌ పెట్టాడు. సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాలని, వారు మాట్లాడే మాటలు ఆడియెన్స్ కి అర్థం కావాలని చెప్పారు. కానీ  కొందరు దాన్నిపాటించడం లేదు. దీంతో రెండో వారంలోనే వారికి ఫనిష్‌మెంట్‌ ఇచ్చారు. 

మళ్ళీ అదే జరుగుతుంది. ముఖ్యంగా అభిజిత్‌, హారిక, అలాగే అరియానాలు ఇంగ్లీష్‌లోనే ఎక్కువసార్లు మాట్లాడారు. దీంతో వారికి నాగ్‌ క్లాస్‌ పీకాడు. అంతటితో ఆగలేదు, వారిని ఆ సెషన్‌ మొత్తం నిల్చో బెట్టి ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు. 

మరోవైపు తాను బాగా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించిన మోనాల్‌ని ప్రశంసించాడు నాగ్‌. అందుకు మోనాల్‌ స్పందనగా తెలుగులో ఓ పాట పాడింది. ఆ పాటకి సభ్యులేకాదు, నాగార్జున సైతం ఇంప్రెస్‌ అయ్యారు. 

ఇదిలా ఉంటే, అభిజిత్‌- మోనాల్‌ మధ్య చోటు చేసుకున్న వివాదం తెరపైకి వచ్చింది. మోనాల్‌ అఖిల్‌కి దగ్గరగా ఉండటం వల్ల వీరి మధ్య జరిగిన కాయిన్స్ గేమ్‌లోని ఓ తప్పిదానికి మోనాల్‌కి అభిజిత్‌ సారీ చెప్పలేదని తేలింది.