Asianet News TeluguAsianet News Telugu

నెవర్‌ బిఫోర్‌.. బిగ్‌బాస్‌ 4 టీజర్ అదుర్స్..!

తాజాగా ట్విట్‌  ద్వారా బిగ్‌బాస్‌4 టీజర్‌ని విడుదల చేశారు నాగార్జున. ఇందులో తాత, తండ్రి, మనవడిగా నాగార్జున కనిపిస్తూ, `మనం` సినిమాని తలపిస్తున్నాడు. త్వరలోనే సీజన్‌ ప్రారంభం కానుందని తెలిపారు.

bigg boss4 show teaser goes viral on social media
Author
Hyderabad, First Published Aug 16, 2020, 12:50 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నాగార్జున ఈసారి `బిగ్‌బాస్‌ 4`ని చాలా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ `బిగ్‌బాస్‌ 4` సీజన్ ఉండబోతుందని నాగ్‌ తెలిపారు. తాజాగా ట్విట్‌ ద్వారా టీజర్‌ని విడుదల చేశారు నాగార్జున. ఇందులో తాత, తండ్రి, మనవడిగా నాగార్జున కనిపిస్తూ, `మనం` సినిమాని తలపిస్తున్నాడు. త్వరలోనే సీజన్‌ ప్రారంభం కానుందని తెలిపారు.

ఈ టీజర్‌లో తాత, మనవడిగా ఉన్న నాగార్జునలు పక్కింట్లో జరుగుతున్న సంఘటనని చూస్తూ వాహ్‌.. వాహ్‌.. బాగుందని తండ్రి నాగార్జునకి చెప్పగా, ఈసారి అంతకంటే బాగుండేది చూపిస్తానని బిగ్‌బాస్‌ 4ని పెడతాడు. చివరగా గతంలో ఎప్పుడూ చూడని బిగ్‌బాస్‌ని చూస్తానని చెప్పడం ఆకట్టుకుంది. ఈ టీజర్‌ అత్యంత ఆసక్తికరంగా, బిగ్‌బాస్‌4 సీజన్‌పై అంచనాలను పెంచుతుంది. మొత్తానికి ఈ సీజన్‌ డిఫరెంట్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు. 

ఈ టీజర్‌ని శనివారం రాత్రి నాగార్జున ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ముఖ్యంగా ముగ్గురు నాగార్జునలతో సాగే టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. నాగ్‌ అభిమానులను అబ్బురపరుస్తుంది. 

స్టార్‌ మాలో ప్రసారమయ్యే ఈ షో నాలుగో సీజన్‌ అనే విషయం తెలిసిందే. మొదటి సీజన్ కి ఎన్టీఆర్‌ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్‌కి నాని, మూడు, నాలుగు సీజన్లకి నాగ్‌ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటిస్టెంట్స్ లిస్ట్ లీక్‌ అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios