Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌజ్ ను వీడినా దీక్షను వదలని హరితేజ,అర్చన

  • బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన దీక్ష
  • అర్చనతో పోటీ పడి దీక్షను టార్గెట్ చేసిన హరిితేజ
  • దీక్ష హౌజ్ వీడాక బయటపడుతున్న హరితేజ నిజస్వరూపం
bigg boss hariteja archana could not stop commenting diksha

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న స్టార్ మా బిగ్‌బాస్ సీజన్ 1 రియాలిటీ షో చివరి వారంలో అడుగుపెట్టింది. పై ఆదివారం గ్రాంజ్ ఫినాలేలో విజేతలెవరో తేలనుంది. దీక్షను ఇంటి నుండి బిగ్ బాస్ పంపేయటంతో... అనూహ్యాంగా అర్చన సేఫ్ జోన్ లోకి వెళ్లింది. 14 మంది కన్టెస్టెంట్స్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 1 65వ ఎపిసోడ్ కు వచ్చేసరికి కేవలం ఐదుగురు కన్టెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక 65వ ఎపిసోడ్ లో ప్రధానంగా... దీక్ష బిగ్ బాస్‌ హౌస్‌ను వీడుతూ మిగతా హౌస్ మేట్స్‌పై చేసిన ఆరోపణలపైనే ఎక్కువగా చర్చ జరిగింది.

 

దీక్ష చేసిన కమెంట్స్ పై అర్చన మాట్లాడుతూ... తాను నామినేషన్స్‌లో బిగ్‌బాస్ హౌస్‌ను వీడటానికి మానసికంగా సిద్దం అయ్యానని .. తానే వెళ్లిపోతాననుకున్నా అనుకోకుండా దీక్ష ఎలిమినేట్ అయ్యి సర్ ప్రైజ్ ఇచ్చిందని అర్చన చెప్పుకొచ్చింది. అయితే తాను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించినా హౌస్ మేట్స్ పై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసేదాన్ని కాదని(నిజంగానా).. అందరి గురించి అద్భుతంగా మాట్లాడేదాన్నని కవరింగ్ ఇచ్చింది.

రోజులో దాదాపు ముప్పావు వంతు సమయం అంతా హరితేజ, అర్చనలు దీక్ష నామస్మరణతో గడిపేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చినప్పుడు దీక్ష చాలా ఎక్కువ చేసిందని, ఆమెకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదంటూ ఇంటిని వదిలి వెళ్లాక కూడా దీక్షపైనే అవాకులు పేలడం గమనార్హం. ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌజ్ లో వంట చేసేటప్పుడు దీక్ష వంటగదిలో ఎక్కడ ఏ సామాన్లు ఉన్నాయో నీకు తెలుసా అని అడిగితే.. అన్నీ తెలిసిన దానిలా బిల్డప్ ఇచ్చిందని., నిజానికి ఆమెకు ఏది ఎక్కడ ఉందో తెలియదని హరితేజ దెప్పిపొడిచింది. అయితే అక్కడే  వున్న శివబాలాజీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ చాలా క్లెవర్ అని, ఆయనకు ఎవరేంటో తెలుసనీ, అయినా అలా అన్నీ అడుగుతారని శివబాలాజీ అన్నారు.



ఇక బిగ్ బాస్ సీజన్ 1 చివరి అంకానికి చేరకుందని దీంతో ఈవారం ఎలిమినేషన్స్ ఉండవని ఇప్పటికే బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో ఎలినినేషన్ నామినేషన్స్ జరగలేదు. ఇక మీరు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఈ చివరి రోజులు మీ జీవితంలో మధురానుభూతులను మిగల్చాలని కోరుకుంటున్నానని బిగ్ బాస్ తెలిపారు. ఇక ఈవారం వీక్షకులను ఆకట్టుకునే విధంగా వినూత్న పద్దతుల్లో ఓటును అభ్యర్జించాలన్నారు బిగ్ బాస్. దీంతో నవదీప్, హరితేజ,అర్చన, ఆదర్శ్, శివబాలాజీలు తమ క్రియేటివిటీని ఉపయోగించి మరీ ప్రేక్షకులను ఓటు అభ్యర్థించారు.

 

అర్చన క్లాసికల్ డాన్స్ తో తన పెతాపం సూపగా.. హరితేజ గతంలో మాదిరిగానే... బుర్రకథ చెప్తూ ఓట్లు అభ్యర్థించింది. అయితే.. చివరి రోజుల్లో అసలు రూపం బైటపెట్టుకుంటూ హరితేజ పోటీ నుంచి స్వయంకృతాపరాథాలు చేస్తూ.. తప్పులు చేస్తూ... దొరికిపోతోంది. దీన్ని సవరించుకుని, పద్ధతి మార్చుకుని గేమ్ ఆడితే హరితేజకు కొన్ని ఎక్కువ ఓట్లన్నా దక్కుతాయి. ఇక హౌజ్ లో అంతా ఏదో చిల్లరమల్లరగా బిహేవ్ చేస్తున్నా.. శివ బాలాజీ మాత్రం హుందాగా ప్రవర్తిస్తూ.. తనదైన పద్ధతిలో ఆడుతూ గేమ్ గెలుస్తారని పిస్తోంది.ఎందుకంటే ఇప్పటికే అర్చన, ఆదర్శ్ లు చావు అంచుల వరకు వెళ్లివచ్టా

Follow Us:
Download App:
  • android
  • ios