Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 5 టీఆర్పీ.. 'స్టార్ మా'కు బిగ్ షాక్, EMK పరిస్థితి కూడా అంతే..

దేశంలో బిగ్ బాస్ షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో కూడా బిగ్ బాస్ షోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Bigg Boss 5 Telugu and EMK TRP report
Author
Hyderabad, First Published Sep 16, 2021, 2:07 PM IST

దేశంలో బిగ్ బాస్ షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో కూడా బిగ్ బాస్ షోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నాలుగు సీజన్లుగా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ షో.. ప్రస్తుతం 5వ సీజన్ లోకి అడుగుపెట్టింది. తొలి వారం పూర్తి చేసుకుంది. 

బిగ్ బాస్ 5 సెప్టెంబర్ 5ఆ గ్రాండ్ గా లాంచ్ అయింది. తాజాగా లాంచ్ ఎపిసోడ్ టీఆర్పీ వివరాలు బయటకు వచ్చాయి. బిగ్ బాస్ 5 లాంచ్ ఎపిసోడ్ కు మంచి రేటింగ్ నమోదైంది. లాంచ్ ఎపిసోడ్ 15.7 రేటింగ్ నమోదు చేసుకుంది. బిగ్ బాస్ కి ఉన్న ఆడియన్స్ చెక్కు చెదర్లేదని ఈ రేటింగ్ పాయింట్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. 

అయితే ఇక్కడ కొంత నిరాశ కూడా ఉంది. బిగ్ బాస్ సీజన్ 4 లాంచ్ ఎపిసోడ్ కంటే సీజన్ 5కి రేటింగ్ తగ్గింది. గత సీజన్ లో బిగ్ బాస్ షో 18 రేటింగ్ నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రేటింగ్ లో తగ్గుదల స్టార్ మా కు షాకిచ్చే విధంగానే ఉంది. 

ఊహకు అందని విధంగా సీజన్ 5లో తొలి రోజే 19 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపారు. అయినప్పటికీ రేటింగ్ గత సీజన్ కంటే ఎక్కువ రాలేదు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా లాంచ్ ఎపిసోడ్ ని ప్రసారం చేయడం మైనస్ గా మారిందని అంటున్నారు. 

బిగ్ బాస్ కు మూడవ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 5లో హౌస్ లో వైలెన్స్ ఎక్కువవుతోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో జెమినిలో ప్రసారం అవుతోంది. ఈ షోకి కూడా యావరేజ్ తరహాలోనే రేటింగ్ నమోదైంది. గత వారం ఎపిసోడ్స్ కి యావరేజ్ గా 7.2 రేటింగ్ నమోదైంది. అంతకు ముందు వారం యావరేజ్ గా 6 రేటింగ్ నమోదైన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకి ఇలాంటి రేటింగ్ నమోదు కావడంఅంటే తక్కువనే చెప్పాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios