Asianet News TeluguAsianet News Telugu

టాక్ ఆఫ్ ది టౌన్‌ గా బేతాళుడు

  • బేతాళుడుకు క్రేజీ టాక్
bichagadu vijay anthony craze

గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజ‌య్ ఆంటోని. డా.సలీం, నకిలీ  సినిమాలతో విభిన్న చిత్రాల హీరొగా  పేరు తెచ్చుకున్న విజయ్ , బిచ్చ‌గాడు తో  స్టార్ ఇమేజ్ ను టాలీవుడ్ తెచ్చుకొగలిగారు.  ఓ వైపు సంగీత ద‌ర్శ‌కుడిగా బిజీగా ఉంటూనే హీరోగా త‌న‌ని తాను సరికొత్తగా ఆవిష్క‌రించుకున్న ఆంటోని .. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ మార్కెట్లో హాట్ టాపిక్‌ గా మారిపొయాడు. అత‌డు న‌టించిన సినిమా వ‌స్తోంది అంటేనే అదో అటెన్షన్.

 

 

`బిచ్చ‌గాడు` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న విజ‌య్ ఆంటోని ఎంచుకునే క‌థ‌ల్లో సంథింగ్ స్పెషాలిటి ఆడియెన్‌కి విప‌రీతంగా న‌చ్చుతోంది. మరొపక్క అత‌డు త‌న‌కు తానే ఓ బ్రాండ్‌గా ఆవిష్క‌రించుకున్న తీరు మార్కెట్ వ‌ర్గాల‌కు న‌చ్చుతోంది. అందుకే విజయ్  న‌టించిన `భేతాళుడు` చిత్రానికి త‌మిళ్‌, తెలుగు మార్కెట్ల‌లో అసాధార‌ణ క్రేజు నెల‌కొంది. అస‌లు ఆంటోని ఓ సినిమాలో న‌టిస్తున్నాడు అంటేనే బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఫ్యాన్సీ ఎమోంట్ లను ఆఫర్ చెస్తున్నారంటే  అతిశ‌యోక్తి కకాదు. భేతాళుడు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లు, ట్రైల‌ర్స్ తో పాటు తొలి పది నిమిషాల సినిమాని కూడా ఆడియెన్స్ కు ముందుగానె చూపించారంటేనె విజయ్ ఈ సినిమా విజయం పై ఎంత కాన్పిడెన్స్ తొ ఉన్నారొ అర్దం చెసుకొవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios