Asianet News TeluguAsianet News Telugu

ఆ విష‌యంలో  అస్స‌లు త‌గ్గేదిలేదు: బెల్లంకొండ శ్రీను

  • హీరోగా 2 సినిమాలు చేసినా హిట్ కొట్టడానికి కష్టపడ్తోన్న బెల్లంకొండ శీను
  • ఎన్ని కోట్లు ఇచ్చైనా టాఫ్ హిరోయిన్స్ తోనే సినిమా తీస్తానంటున్నాడు
  • ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్రగ్యా జైస్వాల్ తో మూవీ చేస్తున్న బెల్లంకొండ శ్రీను
bellamkonda srinu follow succses formula


 హీరోగా 2 సినిమాలు చేసినా హిట్ కొట్టడానికి కష్టపడ్తోన్న బెల్లంకొండ శీను హీరోయిన్స్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఎన్ని కోట్లు ఇచ్చైనా సరే టాప్ లో ఉన్న హీరోయిన్స్ ని.. ఐడెంటెటీ ఉన్న భామలతోనే రొమాన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ సినిమాలోనే సమంతాతో రొమాన్స్ చేసిన శీను.. ఐటమ్ సాంగ్ పేరుతో తమన్నాతోనూ రెండుసార్లు ఆడిపాడాడు. స్పీడున్నోడులో సోనారిక బడోరియాతో జత కట్టిన బెల్లంకొండ.. లేటెస్ట్ మూవీలో రకుల్ తో పాటు మరో హ్యాపెనింగ్ భామ ప్రగ్యా జైస్వాల్ తోనూ జోడీ కట్టబోతున్నాడు. 

బోయపాటి శీను డైరెక్షన్లో యాక్ట్ చేస్తోన్న బెల్లంకొండ శీను పక్కన రకుల్ ఇదివరకే కన్ఫామ్ కాగా.. త్వరలో ప్రగ్యా జైస్వాల్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనుందట. కంచె మూవీతో ఒక్కసారిగా అందర్ని ఆకర్షించిన ప్రగ్యా జైస్వాల్ వరసగా ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మార్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీస్తోన్న ఓం నమో వెంకటేశాయతో పాటు క్రిష్ణవంశీ నక్షత్రం.. మంచు మనోజ్ మూవీలో యాక్ట్ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్ కి మంచి రెమ్యునరేషనే ఆఫర్ చేసి శీను పక్కన తీసుకున్నారట. చూస్తుంటే హిరోయిన్స్  విషయంలో అస్సలు తగ్గని శీనుబాబుకి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి
 

Follow Us:
Download App:
  • android
  • ios