Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యతో చిరు, రాంచరణ్, ఎన్టీఆర్.. 'ఆహా'కు కాసుల పంట, ఆ లీకులు నిజమైతే..

ప్రస్తుతం ఓటిటి లకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాత అల్లు అరవింద్.. 'ఆహా' ఓటిటీని లాంచ్ చేశారు. ఆహా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. క్రమంగా ఆహా సభ్యత్వాలు పెంచుకుంటూ దూసుకుపోతోంది.

Balakrishna Unstoppable show give huge profits to Allu Aravind
Author
Hyderabad, First Published Nov 7, 2021, 2:02 PM IST

ప్రస్తుతం ఓటిటి లకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాత అల్లు అరవింద్.. 'ఆహా' ఓటిటీని లాంచ్ చేశారు. ఆహా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. క్రమంగా ఆహా సభ్యత్వాలు పెంచుకుంటూ దూసుకుపోతోంది. అల్లు అరవింద్ ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఆహాని డెవలప్ చేస్తూ సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఆహాలో విభిన్నమైన షోలు ప్లాన్ చేస్తున్నారు. 

అందులో భాగంగా మొదలైన షో 'Unstoppable'. నందమూరి Balakrishna హోస్ట్ గా ప్రారంభమైన ఈ షోకి కేవలం ఒక్క ఎపిసోడ్ తోనే క్రేజీగా మారిపోయింది. ఈ షోలో బాలయ్య రాజసంగా కనిపిస్తున్నారు. తొలి ఎపిసోడ్ కి అతిథిగా మోహన్ బాబుని తీసుకురావడం.. బాలయ్య, మోహన్ బాబు మధ్య సినీ రాజకీయ అంశాలపై ఆసక్తిగా చర్చ జరగడంతో ఈ షోకి వీక్షకులు పెరిగారు. 

Also Read: ఎర్ర చీరలో మలైకా అందాలు.. మెస్మరైజ్ చేసే హాట్ నెస్, కుర్రాళ్లకు కిక్కు గ్యారెంటీ

అన్ స్టాపబుల్ షో ప్రారంభం అయ్యాక ఆహా యాప్ కి సభ్యత్వాలు పెరిగాయట. దీనితో Allu Aravind వేసిన ప్లాన్ 100 శాతం సక్సెస్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం ఆహా కాసుల పంట పండిస్తూ దూసుకుపోతోంది. రానున్న రోజుల్లో బాలయ్య షోకి అతిథులుగా చిరంజీవి, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ రాబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. దీనితో ఆహా యాప్ కు సభ్యత్వాలు మునుపటికంటే భారీ స్థాయిలో పెరుగుతున్నట్లు టాక్. 

బాలయ్య, చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ ఒకే వేదికపై కనిపిస్తే ఆ మజానే వేరు. ఈ లీకులు నిజమైతే రానున్న రోజుల్లో ఆహా స్థాయి మరింత పెరుగుతుంది. తొలి ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ షో ఎంత కిక్కు ఇవ్వబోతోందో అర్థం అయిపోయింది. దీనితో రానున్న ఎపిసోడ్స్ కి అతిథులుగా ఎవరు ఆబోతున్నట్లు అనే ఉత్కంఠ నెలకొంది. వ్యక్తిగత విషయాలు ప్రశ్నిస్తూ, రాజకీయాలని కూడా తెరపైకి తెస్తూ బాలయ్య మోహన్ బాబుని ప్రశ్నించారు. షోని చాలా రసవత్తరంగా నడిపించారు. 

బాలయ్య షో మాత్రమే కాక సరికొత్త చిత్రాలు ఆహా లో విడుదలవుతున్నాయి. వెబ్ సిరీస్ లు, వినోదాన్ని అందించే ఎన్నో ప్రోగ్రామ్స్ ఆహా ఓటిటిలో ప్లాన్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios