Asianet News TeluguAsianet News Telugu

హాలీవుడ్ సైట్ టాప్ టెన్ లిస్ట్ లో బాహుబలి

  • తెలుగు సినిమాకు కీర్తిని ఆర్జించి పెట్టిన బాహుబలి చిత్రం
  • ప్రభాస్, రాజమౌళి, రానా, అనుష్క కాంబినేషన్ లో వచ్చిన చిత్రం
  • హాలీవుడ్ సైట్స్ టాప్ మూవీస్ లిస్ట్ లోనూ టాప్ టెన్ లో బాహుబలి
bahubali movie stands world top 10 in hollywood site

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి చిత్రం 2017లో రిలీజై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తీర్చిదిద్దిన బాహుబలి ఇంతవరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. రిలీజయిన ప్రతి భాషలోనూ కలెక్షన్ల వర్షం కురిసింది. ఇందులో నటించిన తారలంతా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజికి తీసుకెళ్లిన సినిమాగా బాహుబలి ఖ్యాతినార్జించింది.
 

 

ఇప్పటికే బాహుబలి ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులున్నాయి. తాజాగా మరో ఘనత బాహుబలి ఖాతాలో చేరింది. హాలీవుడ్ లో రొటెన్ టమాటాస్ అనే పాపులర్ వెబ్ సైట్ ఉంది. హాలీవుడ్ సినిమాలకు ఈ సైట్ ఇచ్చే రివ్యూలకు.. రేటింగ్ కు చాలా వాల్యూ ఉంటుంది. ఈ వెబ్ సైట్ 2017 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వేలాది సినిమాల్లో టాప్ 10 లిస్ట్ ఎంపిక చేసింది. ఇందులో బాహుబలికి రెండోస్థానం దక్కింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ మొత్తం చందమామ కథలా ఉన్నా రెండో పార్ట్ ను డైరెక్టర్ రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబిచ్చేశారు. ఈ సినిమా ఓ ఎపిక్ గా నిలిచిపోతుందని అందులో ప్రశంసించేశారు.



ఇండియాతోపాటు దక్షిణ ఆసియా అంతా బాహుబలి మాసివ్ హిట్  అయింది. సినిమాల్లో కథావస్తువు పాతదే అయినా దానిని సరికొత్తగా చెబితే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ఈ మూవీ ప్రూవ్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే మనం సినిమాలంటే ఎందుకు ఇష్టపడతాం అంటే కొన్ని సినిమాల పేర్లు అలా నోటికొచ్చేస్తాయి. బాహుబలి కూడా అదేవిధంగా సినిమాలపై మనకున్న ఇష్టాన్ని పెంచే అద్భుతమైన చిత్రమని ఆ సైట్ బాహుబలిని ఆకాశానికెత్తేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios