యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు త్రివిక్రమ్. 

షూటింగ్ ఉదయం 7 గంటలకి పెట్టుకుంటే తారక్ ఆరున్నరకే సెట్ లో ఉండేవాడట. దీంతో తారక్ కోసం యూనిట్ మొత్తం అరగంట ముందే రావాల్సి వచ్చేదని అదొక టార్చర్ అని చమత్కరించాడు త్రివిక్రమ్. 

ఉదయాన్నే షూటింగ్ కోసం వచ్చే తారక్ అర్ధరాత్రి వరకు అంతే ఎనర్జీతో ఎలా ఉండేవాడో ఇప్పటికీ అర్ధం కాదని త్రివిక్రమ్ అన్నారు. అతడి ఎనర్జీని ఆపే యాంటిబయాటిక్ లేదనిపిస్తుందని అదొక వైరస్ అని అభిప్రాయ పడ్డారు.

ఒక రోజులో పూర్తి చేయాల్సిన సీన్ మధ్యాహ్నానికే పూర్తయ్యేదని, తారక్ కారణంగా వంద రోజుల పాటు చేయాల్సిన షూటింగ్ డెబ్బై రోజుల్లోనే పూర్తయిందని అన్నారు. హీరోలు క్రమశిక్షణగా ఉంటే పనులన్నీ అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయని తారక్ గొప్పతనం గురించి వివరించారు. 

ఇవి కూడా చదవండి.. 

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

రెడ్డి ఇక్కడ సూడు.. సాంగ్ కోసం రెడీగా ఉండండి!

అరవింద సమేత ఫొటో కార్డ్ డిజైన్స్ (ఫొటోలు)

అరవింద సమేత: తారక్ పాత్ర గురించి త్రివిక్రమ్ కామెంట్!