యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' విడుదలకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ని వెండితెరపై చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హడావిడి మొదలైపోయింది.

టికెట్ బుకింగ్ లు, ప్రీమియర్ షోలు అంటూ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయం బయటకి వచ్చేసింది. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీగార్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. అదీ కూడా హీరోయిన్ పూజా హెగ్డేకి.. ఓ ప్రమాదం నుండి హీరోయిన్ ని హీరో కాపాడతాడు. ఆమె ఎన్టీఆర్ ని తనతో పాటు రాయలసీమకి తీసుకెళ్లడం, ఎన్టీఆర్ ధైర్యం మెచ్చి హీరోయిన్ ఇంటి సభ్యులు అతడిని  పూజా హెగ్డేకి బాడీగార్డ్ గా ఉండమని అడుగుతారట.

సినిమా ప్రారంభ సన్నివేశాలు ఇలానే సాగుతాయని తెలుస్తోంది. ఇక సినిమాలో సునీల్ పాత్ర కొత్తగా ఉంటుందని అతడో గ్యారేజీ నడుపుతుంటాడని, అదే గ్యారేజీలో ఎన్టీఆర్ కూడా చేరి సునీల్ కి తోడుగా ఉంటాడని సమాచారం. 

ఇవి కూడా చదవండి.. 

కళ్యాణ్ రామ్ తల్లి గురించి ఎన్టీఆర్ ఏమన్నాడంటే..?

'అరవింద సమేత'పై రన్ టైమ్ ఎఫెక్ట్..?

ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!