నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకి తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. అయినప్పటికీ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు ఒక తల్లికి పుట్టిన పిల్లల్లానే ప్రేమగా ఉంటారు. మొదట్లో వీరిద్దరి మధ్య మాటలు ఉండేవి కాదు. కానీ మెల్లగా ఇద్దరూ ఒకటయ్యారు.

తన తమ్ముడిని హీరోగా పెట్టి కళ్యాణ్ రామ్ 'జై లవకుశ' సినిమాను కూడా నిర్మించారు. హరికృష్ణ మరణంతో వీరిద్దరూ మరింత స్ట్రాంగ్ గా మారి తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. తారక్ గతంలో ఎప్పుడూ కళ్యాణ్ రామ్ తల్లి గురించి మాట్లాడిన సందర్భాలు లేవు.

తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన కళ్యాణ్ రామ్ తల్లిని పెద్దమ్మ అని సంభోదిస్తూ.. భర్త మరణంతో ఆమె పడుతున్న బాధ గురించి విచారం వ్యక్తం చేశారు. తండ్రి మరణంతో తాను, కళ్యాణ్ రామ్ ఎంతో బాధ పడుతున్నామని, ఆ సంఘటన నుండి బయటకి రాలేకపోతున్నామని.. తమ కంటే తమ తల్లుల బాధ 
ఇంకా పెద్దదని అన్నాడు.

తన తల్లితో పాటు పెద్దమ్మ తీవ్ర మనోవేదనకి గురవుతున్నట్లు చెప్పుకొచ్చారు. తన తండ్రి సంపూర్ణమైన జీవితాన్ని గడిపి వెళ్లిపోయారని.. తండ్రిలానే తాను కూడా సంపూర్ణంగా జీవించాలని భావిస్తున్నట్లు, తన పిల్లలకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు తారక్ ఎమోషనల్ గా చెప్పాడు. 

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'పై రన్ టైమ్ ఎఫెక్ట్..?

ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

రెడ్డి ఇక్కడ సూడు.. సాంగ్ కోసం రెడీగా ఉండండి!