యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత'పై భారీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై తెర వెనుక కుట్ర పన్నారని తెలుస్తోంది.

అక్టోబర్ 11న సినిమా విడుదల చేస్తున్నట్లు 'అరవింద సమేత' చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. దీంతో ఆ సమయానికి రావడానికి ఏ సినిమా సాహసించలేదు. కానీ 'నోటా' సినిమా అక్టోబర్ 5న విడుదల కావడానికి ఓ కారణముందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కావాలి. కానీ ఆ డేట్ న సినిమా రాకుండా కొందరు అడ్డుపడ్డారు.

అంతవరకు తెలిసిన విషయమే.. అయితే 'నోటా' సినిమా వెనక్కి వెళ్లకుండా ముందుకు రావడం వెనుక ఇండస్ట్రీలో కొందరి ప్లాన్ ఉందని అంటున్నారు. దేనికంటే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా హిట్ అయితే మూడు, నాలుగు వారాలు థియేటర్ నుండి తీసేసే ఛాన్స్ లేదు.

ఆ కోణంలో చూసుకుంటే 'నోటా' సినిమా హిట్ అయితే 'అరవింద'కి థియేటర్ల సమస్య వస్తుందని ఊహించి కావాలనే 'నోటా'ని ముందుకి వచ్చేలా కొందరు స్ట్రాటజీలు చేశారని  సమాచారం. కానీ ఇప్పుడు 'నోటా' సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో థియేటర్ల సమస్య వచ్చే అవకాశమే లేకుండా పోయింది. 

ఇవి కూడా చదవండి.. 

తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

ఇది కరెక్ట్ టైటిల్.. డౌట్ అనవసరం: తారక్ కామెంట్

ఆ పాట విని అమ్మ ఏడ్చేసింది: ఎన్టీఆర్!

'అజ్ఞాతవాసి' డిజాస్టర్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అరవింద సమేత: ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ (ఫోటోలు)

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ అభిమానులు ఊహించని సర్ప్రైజ్!

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?