యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఈ సారి భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇతర రాష్ట్రాల్లో కూడా సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నై సింగిల్ స్క్రీన్స్ లలో దాదాపు 180 షోలు ప్రదర్శించబడనున్నాయి. కోలీవుడ్ లో త్రివిక్రమ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో మల్టిప్లెక్స్ లు కొన్ని హౌస్ ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. దీంతో కోలీవుడ్ లో కూడా కోత మొదలవ్వనుందని టాక్ వస్తోంది.  

గతంలో అజ్ఞాతవాసి మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. దీంతో అరవింద సమేత కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో హిట్ ఐయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు గడిస్తే గాని కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయో చెప్పడం కష్టమే. అయితే తప్పకుండా పాత రికార్డులను మాత్రం వీర రాఘవుడు బీట్ చేస్తాడని సినీ పండితులు చెబుతున్నారు. 

 

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటంటే..?

కళ్యాణ్ రామ్ తల్లి గురించి ఎన్టీఆర్ ఏమన్నాడంటే..?

'అరవింద సమేత'పై రన్ టైమ్ ఎఫెక్ట్..?

ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?