Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ లవ్ స్టోరీకి డిఫరెంట్ టైటిల్!

టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికి మినిమమ్ ఏడాది సమయాన్ని తీసుకుంటారని అందరికి తెలిసిందే. ఇక సినిమా కథను బట్టి మరికొందరు ఇంకాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అయితే ప్రభాస్ మాత్రం అందరికంటే ఎక్కువ టైమ్ తీసుకొని అభిమానులకు పెద్ద పరీక్షే పెడుతున్నాడు. 

prabhas radha krishna project different title
Author
Hyderabad, First Published Oct 8, 2018, 3:16 PM IST

స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికి మినిమమ్ ఏడాది సమయాన్ని తీసుకుంటారని అందరికి తెలిసిందే. ఇక సినిమా కథను బట్టి మరికొందరు ఇంకాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అయితే ప్రభాస్ మాత్రం అందరికంటే ఎక్కువ టైమ్ తీసుకొని అభిమానులకు పెద్ద పరీక్షే పెడుతున్నాడు. 

రెబల్ స్టార్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2 వచ్చి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సాహోతో పాటు మరో సినిమా షూటింగ్ లో కూడా బిజీగా ఉన్నాడు. జిల్ ఫెమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక లవ్ స్టోరీ చేయనున్నాడు. ఆ కథ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందట. 

ఆ సంగతి అటుంచితే సినిమాకు ఇటీవల ఒక మంచి టైటిల్ ను సెట్ చేశారని తెలుస్తోంది. "అమూర్" అనే టైటిల్ సినిమా కథకు కరెక్ట్ గా సరిపోతుందని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఇంతకు ఆ టైటిల్ కు అర్ధమేంటని ఆలోచిస్తున్నారా?. దాన్ని ఫ్రెంచ్ లో ప్రేమ అంటారు. యూరప్ నేపథ్యంలో సినిమా సాగుతుందని అలా పెట్టారట. అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్టమయ్యేలా తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. 

సాహో షూటింగ్ కూడా ప్రస్తుతం యూరప్ లోనే జరుగుతోంది. రెండు సినిమాలతో ప్రభాస్ అక్కడ బిజీగా ఉన్నాడు. వీలైనంత వరకు రెండు ప్రాజెక్టులను ఫినిష్ చేసి తెలుగు హిందీ తమిళ్ ప్రేక్షకులను పలకరించాలని అనుకుంటున్నాడు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ చేస్తోన్న ప్రేమ కథలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios