Asianet News TeluguAsianet News Telugu

కోలుకున్న లాస్య... ఆయనతో డ్యూయెట్స్ పాడుతుందిగా!

యాంకర్ లాస్య కోలుకున్నారు. ఇటీవల హాస్పిటల్ పాలైన ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. దానికి ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోనే నిదర్శనం.

anchor lasya gets well and doing duets with husband
Author
First Published Sep 15, 2022, 9:28 AM IST

ఇటీవల లాస్య భర్త మంజునాథ్ అందరినీ ఆందోళనకు గురిచేశారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న లాస్య ఫోటో షేర్ చేసిన ఆయన... ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్ పెట్టాడు. సడన్ గా లాస్యను పేషెంట్ గా చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆమెకు ఏమైందని కంగారు పడ్డారు. తర్వాత లాస్య ఫీవర్ కారణంగా హాస్పిటల్ లో చేరినట్లు తెలిసింది. దీంతో లాస్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేశారు. ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. కొద్దిరోజులు హాస్పిటల్ లో ఉన్న లాస్య తిరిగి కోలుకున్నట్లు ఉన్నారు. దానికి ఆమె పోస్ట్ చేసిన తాజా వీడియోనే నిదర్శనం. 

భర్త మంజునాథ్ తో రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ చేసిన లాస్య సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో లాస్య మునుపటిలా చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్యూట్ కపుల్ అంటూ కితాబు ఇస్తున్నారు. మరికొందరు మీ హెల్త్ ఎలా ఉందని వాకబు చేస్తున్నారు. ఇక లాస్య, మంజునాథ్ ల రొమాంటిక్ వీడియో వైరల్ గా మారింది. 

గతంలో యాంకర్ గా పలు బుల్లితెర షోలు చేసిన లాస్య ప్రస్తుతం వాటికి దూరం అయ్యారు. యూట్యూబ్ తో పాటు ఇంస్టాగ్రామ్ లో మాత్రమే ఆమె కనిపిస్తున్నారు. లాస్య తరచుగా తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆమెకున్న పాపులారిటీ రీత్యా వీడియోలకు చెప్పుకోదగ్గ వ్యూస్ దక్కుతున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న లాస్య స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా వారాలు హౌస్లో ఉన్నారు. అయితే ఆమె పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన లాస్య కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios