రీసెంట్ గా మనసుకు నచ్చింది అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దర్శనం ఇచ్చిన అమైరా దస్తూర్. అయితే.. ఈ సినిమా ఆమెకు అంతగా గుర్తింపుతీసుకురాలేదు. ఈ సినిమాలో అమ్మడి పాత్ర పూర్తిగా సాంప్రదాయబద్ధంగా నడిచే రోల్ కావడంతో.. గ్లామర్ షో చేసేందుకు అంతగా అవకాశం లేకపోయింది.అందుకే ఇప్పుడు నిజంగా తనకు మనసుకు ఏం నచ్చిందో అదే చేసే పనిలో పడిపోయింది అమైరా. అందులో భాగంగా ఓ హాట్ హాట్ ఫోటో షూట్ చేసి.. దాన్ని నెట్ లో పెట్టేసింది అమైరా. స్కిన్ షో కు కొత్త స్పెల్లింగులు రాస్తున్న రేంజులో అమైరా అందాలు మత్తులో ముంచేస్తున్నాయి. 

ఇంతటి అందాన్ని ఆన్ స్క్రీన్ మీద చూసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తి కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆ రోజు కూడా త్వరలోనే వచ్చేయనుంది. ప్రస్తుతం ఈ చిన్నది రాజుగాడు అంటూ రాజ్ తరుణ్ సరసన ఓ సినిమా చేస్తుంది. త్వరలోనే ఈ మూవీకి రిలీజ్ కానుంది. అప్పటి వరకూ వెయిట్ చేయండి మరి.