షాక్! ఈ నల్లబడిన ప్రయాంకని చూశారా...

First Published 24, Feb 2018, 6:20 PM IST
American model exactly looks like Priyanka Chopra
Highlights
  • మోడల్ మెగన్ మిలన్ అనే నల్ల జాతి మోడల్ అచ్చం మన బాలీవుడ్ ప్రియాంకా చోప్రాలా  లేదు.
  • కలర్ ఒకటి మినహాస్తే కాస్త షేప్ అటుఇటుగా ప్రియాంకా చోప్రాను బ్లాక్ కలర్ లో జిరాక్స్ చేసినట్టే ఉంది.

 సల్మాన్ ఖాన్ - నరేంద్ర మోడీ - షారుఖ్ ఖాన్ ఇలా వీళ్ళలా అచ్చం అలాగే ఉన్నారే అనిపించే ఫోటోలు గతంలో హల్చల్ చేసాయి. అంతదాకా ఎందుకు టాలీవుడ్ మాజీ హీరొయిన్ స్నేహా ఉల్లాల్ ని సడన్ గా చూస్తే ఐశ్వర్య రాయ్ లాగా ఉంటుంది అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దివ్య భారతి చివరి సినిమా తొలిముద్దు ఇంకా బాలన్స్ ఉండగానే చనిపోతే ఆలాంటి ఫీచర్స్ ఉన్న రంభతో బాలన్స్ పూర్తి చేసారు. టీవీ నటుడు రాజ్ కుమార్ కూడా చిరు పోలికల పుణ్యమా అని కెరీర్ మొదట్లో చాలా చాన్సులు కొట్టేసాడు.మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని కథల్లో చదవటమే తప్ప నిజంగా ఉండటం అసాధ్యం. కవలల్లో తప్పించి మరొకరు మనలా ఉండటం అనేది కేవలం ఊహకే పరిమితం. కాని కొన్ని సార్లు విపరీతమైన ఆశ్చర్యానికి లోను చేసేలా పలువురు సెలబ్రిటీలను పోలిన వ్యక్తులను గతంలో చూసాం.
 అమెరికాకు చెందిన మోడల్ మెగన్ మిలన్ అనే నల్ల జాతి మోడల్ అచ్చం మన బాలీవుడ్ ప్రియాంకా చోప్రాలా ఉండటం నెటిజెన్లను షాక్ కి గురి చేస్తోంది. కాకపోతే ఒక్కటే తేడా. ప్రియాంకా ఆపిల్ పండులా మెరిసిపోతే మెగన్ మిలన్ మాత్రం సింగరేణి మేలి రకం నల్ల వజ్రంలా మెరిసిపోతుంది. ఆ కలర్ ఒకటి మినహాస్తే కాస్త ఉబ్బినట్టు ఉండే పెదాలు - బాడీ షేప్ అటుఇటుగా ప్రియాంకా చోప్రాను బ్లాక్ కలర్ లో జిరాక్స్ చేసినట్టే ఉంది. తనలాగే ఒక యెర్ర తోలు హీరొయిన్ ఉందనే సంగతి మిలన్ కు తెలుసో లేదో కాని ఇద్దరు ఒకేలా ఇచ్చిన స్టిల్ ని మాత్రం సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు విపరీతంగా వైరల్ చేసేస్తున్నారు.


 

loader