MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-పారు, జ్యోలకు బిగ్ షాక్

Karthika Deepam 2 Today Episode:దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-పారు, జ్యోలకు బిగ్ షాక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 27వ తేదీ)లో దీపకు కాలు అడ్డం పెట్టిన జ్యోత్స్న. పారిజాతంపై కాఫీ పోసిన దీప. కోపంగా దీపపై చేయెత్తిన పారు. అడ్డుకున్న దశరథ. జ్యో, పారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Feb 27 2026, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో నేను ఏం చెప్పాలి అనుకున్నాను అంటే అంటాడు కార్తీక్. ఏం లేదు లేరా అంటుంది పారు. ఉంది తాత.. దాసు మామయ్య కనిపించకపోవడానికి కారణం తనని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని పారు భయపడుతోంది అని చెప్తాడు కార్తీక్. అదేంటీ దాసు కనిపించాడని దశరథ చెప్పాడు కదా.. అంటాడు శివన్నారాయణ. ఇప్పుడు కనిపించాడు, కనిపించక ముందు అలా జరిగి ఉంటుందేమో అంటాడు కార్తీక్. పారు, జ్యోత్స్న టెన్షన్ పడుతుంటారు. అలాంటిది ఏం లేదురా అని కవర్ చేస్తుంది పారు. 

మరి ఇంత టెన్షన్ ఎందుకో అంటాడు కార్తీక్. సుమిత్ర ఆరోగ్యం గురించి అంటుంది పారు. కావాలంటే మీ తాతను అడుగు. ఆయనకు టెన్షన్ లేదేమో అంటుంది. నిజమేరా సుమిత్ర మళ్లీ కోలుకునేవరకు ఈ టెన్షన్లు తప్పవు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఏదైనా అడగాలి అనుకుంటే డైరెక్ట్ గా అడుగు బావ అంటుంది జ్యోత్స్న. టైం వచ్చినప్పుడు గట్టిగానే అడుగుతాను లే మరదలా అని అక్కడినుంచి వెళ్లిపోతాడు కార్తీక్. వీడేంటే మనతో ఇలా ఆడుకుంటున్నాడు. చూస్తుంటే మన గుట్టంతా వీడికి తెలిసినట్లే ఉందని అంటుంది పారు. నా అనుమానం కూడా అదే గ్రానీ అంటుంది జ్యోత్స్న.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నిజం చెప్పేస్తాను..
Image Credit : Jiohotstar

నిజం చెప్పేస్తాను..

మరోవైపు దీపను తీసుకొని సుమిత్ర గదిలోకి వెళ్తాడు దశరథ. ఏంటి నాన్న అని అడుగుతుంది దీప. మీ అమ్మకు నిజాలు తెలియక హాయిగా నిద్రపోతోంది. కానీ కొందరికి తెలిసిన నిజాలు చెప్పుకునేవరకు నిద్ర రాదు. నువ్వే మా కూతురివి అని మీ అమ్మతో చెప్పాలి అనుకుంటున్నాను అని పడుకున్న సుమిత్రతో నిజం చెప్తాడు దశరథ. అంతలో కార్తీక్ వచ్చి, మామయ్య ఏం చేస్తున్నావు. ముందు మనం బయటకు వెళ్దాం పదా అంటాడు.

నిజం చెప్పేస్తే మనకు భారం దిగిపోతుంది. కానీ అవతలి వాళ్లకు అప్పుడే భారం మొదలవుతుంది. అబద్ధమే కాదు సంతోషాన్ని మోసే శక్తి కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నప్పుడే నిజం చెప్పాలి అంటాడు కార్తీక్. అత్త ఇప్పుడు ఏదీ మోసే పరిస్థితిలో లేదు. ముందు తనకి ఆపరేషన్ జరగాలి. పూర్తిగా కోలుకున్నాకే నిజం చెప్పాలి, ఇప్పుడు కాదు అని దీపను తీసుకుని బయటకు వెళ్తాడు కార్తీక్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: కాశీని పాముతో పోల్చిన స్వప్న- జ్యోతో ఆడుకున్న దాసు- పారు టెన్షన్
Related image2
Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?
37
దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యోత్స్న
Image Credit : Jiohotstar

దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యోత్స్న

దీపను ఏదో ఒకటి చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు జ్యోత్స్న, పారిజాతం. దీప ఏడుపు చూసి కార్తీక్ గాని కళ్లల్లో నీళ్లు తిరగాలి అంటుంది పారిజాతం. ప్లాన్డ్ గా దీపను కాఫీ తీసుకురమ్మని చెప్తారు. దీపకు జ్యోత్స్న కాలు అడ్డుపెడుతుంది. కాఫీ పారు మీద పడుతుంది. పారు ఆవేశంగా దీపపైకి చేయి ఎత్తుతుంది. దశరథ పిన్ని అని గట్టిగా అరుస్తాడు. వెనక్కి తగ్గుతుంది పారు. దీప ఏదో చెప్పబోతుంటే నేను అడిగానా... నువ్వు ఆగు అని పారు, జ్యోత్స్నలపై విరుచుకుపడతాడు దశరథ. 

47
దశరథ ఉగ్రరూపం
Image Credit : Jiohotstar

దశరథ ఉగ్రరూపం

దీపకు నువ్వు ఎందుకు కాలు అడ్డుగా పెట్టావ్? చెప్పు జ్యోత్స్న అంటాడు. నేను నార్మల్ గా ముందుకు పెట్టాను. తను చూసుకోవాలి కదా అంటుంది జ్యోత్స్న. దీపది కదా తప్పు, మమ్మల్ని తప్పు పడుతున్నావేంటి దశరథ అంటుంది పారు. నువ్వు ఏం తప్పు చేయలేదా పిన్ని అని గట్టిగా అడుగుతాడు దశరథ. పనిమనిషిని కాఫీ అడగడం తప్పు కాదు కదా అంటుంది పారు. దీప పని మనిషి కాదు, నా మేనల్లుడి భార్య. నా చెల్లెలి కోడలు. నాకు ఆప్తురాలు. నా భార్య ప్రాణదాత అని గట్టిగా చెప్తాడు దశరథ. అన్నింటికంటే ముందు కడుపుతో ఉన్న మనిషి. కడుపుతో ఉన్న మనిషికి పని చెప్పడం తప్పా కాదా? అని గట్టిగా నిలదీస్తాడు దశరథ.

ఇప్పటినుంచి నీకు కాఫీ కావాలంటే జ్యోత్స్నను అడుగు లేదా నువ్వే పెట్టుకొని తాగు అని ఆవేశంగా అంటాడు దశరథ. నేను పనులు చేయాలా అంటుంది జ్యోత్స్న. చేస్తే తప్పేంటి అంటాడు దశరథ. ఏంటి తాత డాడీ అలా మాట్లాడుతున్నా చూస్తూ ఊరుకుంటావే.. నువ్వు ఏం అడగవా అంటుంది జ్యోత్స్న.

57
ఇక్కడే ఉండిపోదు కదా..
Image Credit : Jiohotstar

ఇక్కడే ఉండిపోదు కదా..

జ్యోత్స్న మీద ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావ్? దశరథ. ఇప్పుడు కొత్తగా తను పనులు ఎలా చేస్తుంది అంటాడు శివన్నారాయణ. నేర్చుకోవాలి కదా నాన్న. తను పెళ్లి చేసుకోకుండా శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోదు కదా.. భర్త, పిల్లలకు వంట చేసి పెట్టాలి కదా నేర్చుకుంటే తప్పేంటి అంటాడు దశరథ. కార్తీక్ కలగజేసుకొని దశరథను బయటకు తీసుకెళ్తాడు. 

దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వాళ్ల అమ్మ అని దశరథ, కాంచన నమ్ముతున్నారు. వాళ్లకు ఒక ఎమోషన్ ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శివన్నారాయణ. 

67
ఏదో జరుగుతోంది..
Image Credit : Jiohotstar

ఏదో జరుగుతోంది..

మీ నాన్నకు ఏదో అయ్యిందే అంటుంది పారు. దీపను ఉద్దేశించి కూతురిపై ఒక్క మాట కూడా పడనివ్వడం లేదు అంటుంది జ్యోత్స్న. అవును నువ్వే కదా కూతురివి అందుకే నిన్ను కాపాడుకుంటున్నాడు అంటుంది పారు. కొన్ని విషయాలు నీకు ఎప్పటికీ అర్థం కావు అని అంటుంది జ్యోత్స్న.

77
అత్త బతకడం నీకు ఇష్టంలేదా?
Image Credit : Jiohotstar

అత్త బతకడం నీకు ఇష్టంలేదా?

మరోవైపు ఎందుకు మామయ్య నీకు ఇంత ఆవేశం. నిజం ఎక్కడ చెప్పేస్తావో అని భయంగా ఉంది అంటాడు కార్తీక్. చెప్తే తప్పేంటి అంటాడు దశరథ. సుమిత్రను చూస్తుంటే నిజం చెప్పకుండా తనని మోసం చేస్తున్నానేమో అనిపిస్తోంది. జ్యోత్స్న, పిన్నిలను చూస్తుంటే వాళ్లు చేసిన పాపాలే గుర్తుకు వస్తున్నాయి. నా కూతురు పడిన కష్టాలే గుర్తుకువస్తున్నాయి అంటాడు దశరథ. 

గట్టిగా అనకు మామయ్య ఎవరైనా వింటారు అంటాడు కార్తీక్. విననివ్వురా ఎప్పటికైనా తెలిసేదే కదా అంటాడు దశరథ. అయితే అత్త బతకాలని లేదా నీకు అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: కాశీని పాముతో పోల్చిన స్వప్న- జ్యోతో ఆడుకున్న దాసు- పారు టెన్షన్
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved