MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు ఎవరు?

రామ్ చరణ్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు ఎవరు?

మ్ చరణ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా? ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఇదే. చిన్న దర్శకులకు పాన్ఇండియా సినిమా అవకాశాలు ఇచ్చి.. ఇబ్బందుల్లో పడుతున్న ప్రభాస్.. ఈసారి రామ్ చరణ్ తో భారీ సినిమా చేసిన దర్శకుడికి అవకాశం ఇచ్చాడట. ఎవరతను? నిజమెంత?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 27 2026, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్ చరణ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా?
Image Credit : Asianet News

రామ్ చరణ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా?

వరుసగా పాన్ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఇద్దరు హీరోలతో సిమాలు చేయడం కోసం పెద్ద పెద్ద దర్శకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. కథలు తయారు చేసుకుని మరీ.. అపాయింట్ మెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. 

ఈక్రమంలో ప్రభాస్ వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. నాలుగు సినిమాలు లైన్ లో ఉండగానే.. మరికొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడట. ఈక్రమంలో రామ్ చరణ్ దర్శకుడికి ప్రభసా్ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు..
Image Credit : our own

ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు..

టాలీవుడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చీ రావడంతోనే.. ఫస్ట్ మూవీ ఉప్పెన తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు, ఇప్పుడు మరో పెద్ద అవకాశాన్ని దక్కించుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు, తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకుని స్టార్ దర్శకుల జాబితాలో చోటు సంపాదించాడు. రెండో సినిమా చేయడానికి టైమ్ పట్టినా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తూ.. దేశ వ్యాప్తంగా చూపు తన వైపు తిప్పుకున్నాడు.

35
బుచ్చిబాబుకు ప్రభాస్ అవకాశం ఇచ్చాడా?
Image Credit : Ram Charan - Buchi Babu

బుచ్చిబాబుకు ప్రభాస్ అవకాశం ఇచ్చాడా?

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పెద్ది సినిమాపై అంచనాలు కూడా భారీస్థాయిలోనే నెలకొన్నాయి. పెద్ది ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా విడుదలకు ముందే బుచ్చిబాబుకు మరో బిగ్ ఆఫర్ వచ్చిందనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బుచ్చిబాబుతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ ఉంది. అందుకు ఓ కారణం కూడా ఉందని ఇండస్ట్రీ లో టాక్.

45
నిర్మాతను దృస్టిలో ఉంచుకుని..
Image Credit : Asianet News

నిర్మాతను దృస్టిలో ఉంచుకుని..

ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగైదు సినిమాలు లైన్ చేశాడు.. ఆయన లైనప్‌లో “స్పిరిట్”, “కల్కి-2”, “ఫౌజీ”, “సలార్-2” వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, రీసెంట్ గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది ది రాజాసాబ్ సినిమా. 

ఈ సినిమా ఫలితం నిరాశ కలిగించడంతో.. నిర్మాత విశ్వ ప్రసాద్ కు మరో అవకాశం ఇవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.ఈ కొత్త ప్రాజెక్ట్ 2027లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభాస్ హీరోగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా రూపొందే ఈ చిత్రానికి దర్శకుడిగా బుచ్చిబాబు పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.

55
క్రేజీ కాంబినేషన్ పై అభిమానుల్లో చర్చ..
Image Credit : Asianet News

క్రేజీ కాంబినేషన్ పై అభిమానుల్లో చర్చ..

ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేస్తున్న పెద్ది పనులు పూర్తయ్యాక, బుచ్చిబాబు ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ పనులను ప్రారంభించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుందని, ప్రముఖ నిర్మాణ సంస్థ People Media Factory బ్యానర్‌లో నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు.

ప్రభాస్ ఈ బ్యానర్‌లో మరోసారి సినిమా చేయబోతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌ను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రభాస్ – బుచ్చిబాబు కాంబినేషన్ ఎలా ఉంటుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: ఆ టాటూ చూశారా? ట్రెండ్ అవుతున్న సాయి పల్లవి కొత్త లుక్.. జుట్టు కత్తిరించేసిందా?
Recommended image2
Premane Oorilo: గాంధీ జయంతికి `ప్రేమనే ఊరిలో`.. ఏకంగా ఏడు సినిమాలతో పోటీ.. అక్కడ హిట్‌, మరి ఇక్కడ
Recommended image3
Sridevi: చిరంజీవికి చుక్కలు చూపించిన శ్రీదేవి.. హీరోయిన్ కండీషన్స్ కు మెగాస్టార్ కూడా తగ్గక తప్పలేదుగా..
Related Stories
Recommended image1
Prabhas : పాన్ ఇండియా సినిమాల కోసం ప్రభాస్ నేర్చుకున్న 5 స్కిల్స్.. ఏంటో తెలుసా?
Recommended image2
రామ్ చరణ్ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ, మెగాస్టార్ ఏమన్నారు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved