Asianet News TeluguAsianet News Telugu

ఆ మూవీ కోసం అఖిల్ పిచ్చ వెయిటింగ్.. విరాట్ కోహ్లీ బయోపిక్ పై ఆసక్తి

అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Akhil Wants to do Virat Kohli Biopic
Author
Hyderabad, First Published Oct 13, 2021, 10:03 AM IST

అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ మొదలయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన Akkineni Akhil ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇంటర్వ్యూలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర విశేషాలతో పాటు తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వివరిస్తున్నాడు. క్రీడల బయోపిక్ చిత్రాలపై తనకు ఆసక్తి ఎక్కువని అఖిల్ తెలిపాడు. స్పోర్ట్స్ బయోపిక్ చిత్రాల్లో కంటెంట్ బలంగా ఉండాలి. అప్పుడే ఆ క్రీడ కథలో హైలైట్ అవుతుంది. 

నేను ప్రస్తుతం రణవీర్ సింగ్ '83' చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా. 83 చిత్రం టీం ఇండియా మాజీ సారధి Kapil Dev జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. రణవీర్ సింగ్ కపిల్ పాత్రలో నటిస్తున్నాడు. కపిల్ దేవ్ లైఫ్, 1983 ప్రపంచకప్ గెలిచిన పరిస్థితులని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 

Also Read: ATMAA: ప్రకాష్ రాజ్ కొత్త కుంపటి ఆత్మా నిజమే? ప్రకటించక పోవడానికి కారణం ఇదే!

అఖిల్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం.క్రికెట్ లో అఖిల్ కు మంచి ప్రావీణ్యం ఉంది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో అఖిల్ ప్రతిభని అందరూ గమనించారు. ఒక దశలో నటుడిగా కాకుండా క్రికెటర్ కావాలని అఖిల్ కలలు కన్నాడు. కానీ ఆ ఆలోచనని విరమించుకున్నాడు. అయితే క్రికెట్ పై అఖిల్ కు ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. 

ఏదైనా క్రీడ లేదా క్రికెట్ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉన్నట్లు అఖిల్ తన మనసులో మాట బయట పెట్టాడు.  క్రీడాకారుల కథలో నేను బాగా సెట్ అవుతాను అని అఖిల్ తెలిపాడు. ఇక తనకు విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉన్నట్లు అఖిల్ రివీల్ చేశాడు. విరాట్ కోహ్లీ జీవితం క్రికెట్ పై ఫ్యాషన్ తో, చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. Virat Kohli బయోపిక్ ఒకరోజున వెండి తెరపై తిరుగులేని కథ అవుతుంది అనే ధీమాని అఖిల్ వ్యక్తం చేశాడు. 

కోహ్లీ చాలా మంది యువతని ప్రభావితం చేశాడు. అతడి జీవితంపై కథ వస్తే చాలా గొప్పగా ఉంటుంది అని అఖిల్ తెలిపాడు. ఇదిలా ఉండగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ అఖిల్ కు నాల్గవ చిత్రం. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలా అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశపరిచాయి. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై అఖిల్ చాలానే హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా క్రేజీ సెన్సేషన్ బుట్టబొమ్మ Pooja hegde నటించింది. చాలా గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ నుండి రాబోతున్న చిత్రం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ మూవీలో అఖిల్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios