Asianet News TeluguAsianet News Telugu

Ajith : కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసిన అజిత్.. థియేటర్స్ లోకి వాలిమై వచ్చేది ఎప్పుడు..?

కోలీవుడ్ లో అజిత్(Ajith) వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అజిత్ సినిమా అంటే పిచ్చి క్రేజ్ ఉంటుంది తమిళంలో. ఇక అజిత్ హీరోగా వినోద్ డైరెక్షన్ లో.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్(Boni Kapoor) నిర్మించిన సినిమా వాలిమై.

Ajith Valimai Movie  New Release Date
Author
Hyderabad, First Published Jan 28, 2022, 10:24 AM IST

కోలీవుడ్ లో అజిత్(Ajith) వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అజిత్ సినిమా అంటే పిచ్చి క్రేజ్ ఉంటుంది తమిళంలో. ఇక అజిత్ హీరోగా వినోద్ డైరెక్షన్ లో.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్(Boni Kapoor) నిర్మించిన సినిమా వాలిమై. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 13న రిలీజ్ కావల్సి ఉంది కాని కరోనా కారణంగా సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు టీమ్. రాను రాను పరిస్థితులు మారుతూ వస్తుండటంతో.. వాలిమై రిలీజ్ పై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

తెలుగులో బలం టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని ఎందుకో ఆ టైటిల్ సెట్ అవ్వదు అనుకున్నారో ఏమో.. ఆలోచన మార్చుకుని వాలిమై(Valimai) పేరుతోనే పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇది ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ షాక్ లో ఉండగానే వాలిమై రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు టీమ్. ఇప్పుడు ఈ సినిమాకు కొత్త డేట్ ను లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కరోనా అన్ని రాష్టాలను కంగారు పెడుతుంది. తమిళనాడులో ముందుగానే  స్పందించిన ప్రభుత్వం థియేటర్స్ లో.. 50 శాతం ఆక్యూపెన్సీని ప్రకటించింది. ఇప్పుడు కేసులు మరింత పెరగడం.. ఒమిక్రాన్ భయంతో.. కోలీవుడ్ లో థియటర్లు చాలా వరకూ  మూసివేశారు. దాంతో సినిమా  రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయక తప్పలేదు మేకర్స్ కి.

కాని ఇఫ్పుడిప్పుడే పరిస్థితులపై క్లారిటీ వస్తుంది. పిబ్రవరి మిడ్ వరకూ కరోనా తీవ్రత పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు చెపుతున్నారు. ఇప్పటికే తమిళనాడుతో ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. వచ్చే నెల వరకూ థియేటర్స్ లో కూడా 50 పర్సంట్ ఆక్యుపెన్సీని ఎత్తివేసే అవకాశం ఉంది. దాంతో సినిమాలన్నీ రిలీజ్ కు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ క్రయంలోనే అజిత్(Ajith) వాలిమై(Valimai) ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను మార్చి 4వ తేదీన రిలీజ్  చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెలలో కరోనా తీవ్రత తగ్గనుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇక అజిత్ (Ajith) వాలిమై(Valimai)  మూవీ కోసం చాలా కష్ట పడ్డాడు. బైక్ రేస్ ల తో స్టంట్స్ చేశాడు. ఈ సినిమాలో అజిత్(Ajith)  కు స్ట్రాంగ్ ఆపోజిట్ క్యారెక్టర్ లో టాలివుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించారు. టాలీవుడ్ లో  హీరోగా వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న కార్తికేయ.. వాలిమై(Valimai)  హిట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.


భారీ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. గిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు.ఇక బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్  బోనీ కపూర్ నిర్మించిన వాలిమైలో   అజిత్ సరసన హీరోయిన్ గా హుమా ఖురేషి నటించింది. ఈ సినిమాలో అజిత్(Ajith)   దోపిడీ దొంగల నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios